త్వరితగతిన పరిష్కరించాలి

- ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ము షారఫ్ అలీ ఫారూఖీ అధ్యక్షతన జిల్లా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ స మావేశం నిర్వహించారు. 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నమోదైన అట్రాసిటీ కేసుల పై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయంతో పా టు రిలీఫ్ ఫండ్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌరహక్కుల దినోత్సవాన్ని ప కడ్బందీగా నిర్వహించాలన్నారు. ఖానాపూర్ ఎ మ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. పోలీస్, రెవె న్యూ అధికారులు అట్రాసిటీ కేసులను పరిష్కరిం చి బాధితులకు సరైన న్యాయం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కేసు ల పరిష్కారానికి ముగ్గురు అధికారులతో కమిటీని నియమిస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాల ని షేధిత చట్టం దర్యాప్తులో మెళకువలకు సంబంధించిన బుక్‌లెట్‌ను మంత్రి, కలెక్టర్ ఆవిష్కరించారు. ఏఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, డీఆ ర్వో సోమేశ్వర్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా ఎ స్సీ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా గిరిజన సం క్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, పీపీ రమణారెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబ, కమిటీ సభ్యులు లక్ష్మణ్, గంగారాం, సత్యనారాయణ తదితరులున్నారు.
సోన్: విద్యాప్రమాణాలు పడిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కడ్తాల్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫాం పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గతేడా ది నాటిన మొక్కలను సంరక్షించిన ఉపాధ్యాయులను, విద్యార్థుల ను శాలువాలతో సన్మానించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కా ర్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, డీఈవో టా మ్నె ప్రణీత, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్ బర్మ లక్ష్మీనర్స య్య, పీఏసీఎస్ డైరెక్టర్ బర్మదాసు, నిర్మల్, సోన్ టీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్లు ముత్యంరెడ్డి, మోహినొద్దీన్, ఉప సర్పంచ్ సాయేందర్, రైతు బంధు సమితి కన్వీనర్ బొజ్జ భీమేశ్, ఎస్ఎంసీ చై ర్మన్లు కొమ్ముల సాగర్, మల్లేశ్, మాజీ సర్పంచ్ లు పోశెట్టి, దేవేందర్, గణేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?