శనివారం 16 జనవరి 2021
Nirmal - Jul 25, 2020 , 00:13:52

సాగుపై చర్చలకే రైతు వేదికలు

సాగుపై చర్చలకే రైతు వేదికలు

కుభీర్‌ : రైతులంతా ఒక్కచోట చేరి సాగు, పెట్టుబడి, సమస్యలపై చర్చించుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో శిలాఫలకం ఆవిష్కరించి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతాంగాన్ని అభివృద్ధి ప థంలో నడిపించే దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అ మలు చేస్తున్నదన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాల య ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తరువాత ఐకేపీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పనుల్లో జిల్లాలోనే మండలం మూడోస్థానంలో ఉన్నదన్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను పూర్తిచేసి, మొద టి స్థానానికి రావాలని అధికారులకు సూచించారు. పలువురు సర్పంచ్‌లు.. మిషన్‌భగీరథ నీరు మండలంలోని ఏ ఒక్క గ్రామానికి సరఫరా కావడంలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కలెక్టర్‌ స్పందిస్తూ.. ఈ విషయంపై పూర్తినివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కుభీర్‌లోని వివేకానంద చౌక్‌ నుంచి వెటర్నరీ హాస్పిటల్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ పనుల కోసం అనుమతులను ఇస్తున్నట్లు చెప్పారు. బీసీ కాలనీలో 11 కేవీ విద్యుత్‌ లైన్‌ తొలగించి, కాలనీవాసులకు రక్షణ కల్పించాలని ఆ శాఖ డీఈని ఆదేశించారు. పలు శాఖల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని గిరిజనులకు అటవీహక్కు పత్రాలు, ప్రభుత్వం ఫలాలు అందించాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే అన్ని సదుపాయాలతో కూడిన దవాఖాన, వైద్యులు, సిబ్బందిని నియమించాలని, గ్రామాల్లో మొరం వేసుకునేందుకు అనుమతివ్వాలన్నారు. ఈ మేరకు కలెక్టర్‌, పీఆర్‌ డీఈని పిలిచి, అవసరం ఉన్న చోట పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూం లక్ష్మి, జడ్పీటీసీ అల్కతాయి చౌహాన్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ రేకుల గంగాచరణ్‌, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.