చివరి ఆయకట్టుకూ నీరందిస్తాం

సోన్ : సరస్వతీ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వారబందీ పద్ధతిలో 35 వేల ఎకరాలకు పైగా భూములను తడుపుతామని స్పష్టం చేశారు. మండలంలోని గాంధీనగర్ గ్రామం వద్ద సరస్వతీ కాలువ ద్వారా శుక్రవారం నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. వానకాలం పంటలకు వారబందీ పద్ధతిలో నీటిని వదులుతామని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీలో 36 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని, ఇన్‌ఫ్లో 8వేల క్యూసెక్కులు కొనసాగుతున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయిందన్నారు. దాని ద్వారా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులను నింపి, తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. రైతులు వానకాలం పంటలను ముందుగానే సాగు చేస్తే, రెండో పంట ధాన్యాన్ని ఏప్రిల్ 15 వరకు విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. దాని ద్వారా అకాల వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తప్పించుకోవచ్చని సూచించారు. అనంతరం గాంధీనగర్‌లోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొంగరి నర్మద, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మంజులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సోన్ సర్పంచ్ వినోద్‌కుమార్, మాజీ ఎంపీపీ అల్లోల గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ నిర్మల్, సోన్ మండలాల మాజీ కన్వీనర్లు ముత్యం రెడ్డి, మోహినొద్దీన్, నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, బండి లింగన్న ఎస్సారెస్పీ ఈఈ రామారావు, సీఐ జీవన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట..
నిర్మల్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మొదటిసారి నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. కమిటీ అధ్యక్షురాలు కొంగరి నర్మద పూల మొక్కను అందించి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారన్నారు. రైతులు ఆనందంగా ఉన్నారని, రెండు పంటలు పండిస్తూ దిగుబడి సాధిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ సర్కారు హయాంలో ఆ పరిస్థితి లేదన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ మండలాధ్యక్షుడు ముత్యం రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ తదితరులున్నారు.
తాజావార్తలు
- ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ క్యూ లైన్లు..
- వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు : మంత్రి గంగుల కమలాకర్
- తెలుగు రాష్ర్టాల సీఎంలకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ
- సోనూసూద్ టైలరింగ్ షాప్.. కస్టమర్ దుస్తులకు నో గ్యారంటీ! ..వీడియో వైరల్
- రామ్ చరణ్, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే
- టీకా దుష్ప్రభావాలపై పరిహారం పొందాలంటే..
- టెస్లాతో భాగస్వామ్యమా? నో వే అంటున్న టాటా
- కరోనా 'పేషెంట్ జీరో'ను ఎన్నటికీ గుర్తించలేం..
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్ విడుదల
- కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది..!