శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Jul 23, 2020 , 01:19:46

డబుల్‌ బెడ్రూం పనుల్లో వేగం పెంచాలి

డబుల్‌ బెడ్రూం పనుల్లో వేగం పెంచాలి

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ మున్సిపల్‌ పరిధిలోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. బంగల్‌పేట్‌, నాగనాయిపేట్‌ సమీపంలోని ఇండ్ల నిర్మాణాలను బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో బంగల్‌పేట్‌ సమీపంలో 444, నాగనాయిపేట్‌ సమీపంలో 1044 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ తాగునీరు, విద్యుత్‌ సరఫరాతో పాటు రోడ్లు, మురుగునీటి కాలువల పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ప్రతిరోజూ పనులను పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ వెంట డబుల్‌ బెడ్రూం ఇండ్ల నోడల్‌ అధికారి మురళీధర్‌రావు, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ బాపు రెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబ, విద్యుత్‌ శాఖ డీఈ మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, తహసీల్దార్‌ సుభాష్‌ చందర్‌ తదితరులు ఉన్నారు.


logo