సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jul 23, 2020 , 01:16:57

రైతుల అభ్యున్నతికే ‘వేదిక’లు

రైతుల అభ్యున్నతికే ‘వేదిక’లు

ముథోల్‌ : రైతుల అభ్యున్నతి కోసమే ప్రభు త్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని ముథోల్‌ ఎ మ్మెల్యే గడ్డిగారి విఠల్‌ రెడ్డి అన్నారు. మండల కేం ద్రంతో పాటు విటోలి గ్రామంలో భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. రైతులు ఈ భవనాలను సద్వినియోగం చేసుకొని, సాగు, పెట్టుబ డి, సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు. 

విలేజ్‌ పార్కు పనుల పరిశీలన..

ముథోల్‌లోని జటా శంకర్‌ ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న విలేజ్‌ పార్కు పనులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పార్కు ద్వారా ప్రజలకు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఉపాధి హామీ నిధులు రూ.5 లక్షలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం జటా శంకర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాజేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ గౌడ్‌, డైరెక్టర్లు సుదర్శన్‌, గోపి పటేల్‌, ఎంపీటీసీ భూమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అఫ్రోజ్‌ ఖాన్‌, నాయకులు సూర్యం రెడ్డి, మగ్ధుం, శ్రీనివాస్‌ గౌడ్‌, సమీ ఉల్లాఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.


logo