రైతుల అభ్యున్నతికి కృషి

ముథోల్ : రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని తరోడా గ్రామం లో మంగళవారం రైతు వేదిక నిర్మాణానికి భూ మిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షే మ పథకాలు ప్రవేశపెడుతున్నదన్నారు. ఇందు లో భాగంగానే రైతు వేదికలు నిర్మిస్తున్నదని చె ప్పారు. రైతులు సాగుపై చర్చించుకునేందుకు ఈ భవనాలు ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్‌ఖాన్, ఎంపీటీసీ గంగాధర్, ముథోల్ సర్పంచ్ రాజేందర్, నాయకులు రవి కిరణ్‌గౌడ్, సూర్యం రెడ్డి, ఆరిఫ్, మైసాజీ, తదితరులున్నారు.
కుభీర్ : మండలంలోని పార్డి(బీ), డోడర్న, ప ల్సి, నిగ్వ గ్రామాల్లో రైతు వేదిక భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తూం లక్ష్మి, జడ్పీటీసీ అల్కతా యి చౌహాన్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, మం డల కో ఆప్షన్ సభ్యుడు మోరె దత్తహరి పటేల్, సర్పంచ్‌లు తూం పుష్పలత, శానూబీ, శ్రీరాము ల కవిత, శ్రీరాముల రాజేశ్, లక్ష్మీరాజు, దేవిదా స్, టీఆర్ఎస్ నాయకులు చౌహాన్ శంకర్, పుప్పా ల పీరాజీ, సంజయ్ చౌహాన్, పల్సి రాజన్న, తహసీల్దార్ అనిరుధ్, ఏవో వికార్ అహ్మద్, పీఆర్డీఈ సురేశ్, ఏఈ రాజేందర్ పాల్గొన్నారు.
మహాగావ్(బీ)లో పనుల పరిశీలన..
భైంసా టౌన్ (భైంసా రూరల్) : మండలంలోని మహాగావ్ (బీ) గ్రామ శివారులో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ అప్పాల రాకేశ్, వీడీసీ అధ్యక్షుడు తోట శంకర్, గొల్ల శ్రీధర్, సీహెచ్ లక్ష్మణ్, కుర్మ సంఘం అధ్యక్షుడు డీ సాయినాథ్, నాయకులు నడికొడ మనోజ్, రాజలింగు, దిగంబర్, రాజు, రవి, జగదీశ్ ఉన్నారు.