కరోనాతో దేవాలయాలకు రాని భక్తులు

నిర్మల్, నమస్తే తెలంగాణ : కొవిడ్-19 ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు భక్తులు లేక బోసిపోతున్నాయి. మార్చి 23 నుంచి లాక్డౌన్ కొనసాగుతుండగా.. జూన్ 8 నుంచి ఆలయాలు తెరుచుకున్నాయి. ఆన్లైన్ సేవలతోపాటు దేవుడి దర్శనం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలకు భక్తులు నామమాత్రంగా వస్తున్నారు. సుమారు రెండున్నర నెలల తర్వాత దేవాలయాలు తెరుచుకోగా.. 45 రోజుల నుంచి కూ డా భక్తుల సందడి కనిపించడం లేదు. కరోనా కారణంగా మానసిక ప్రశాంతత దూరం కాగా.. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత లభించే అవకాశం ఉంది. అలాంటిది భక్తులు దేవాలయాలకు కూడా రావడం లేదు.
నాడు వేలల్లో.. నేడు పదుల్లో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖంగా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారితో పాటు గూడెం సత్యనారాయణస్వామి, కదిలి పాపహరేశ్వరం, కాల్వ లక్ష్మీనర్సింహస్వామి, జైనథ్ లక్ష్మీనారాయణస్వామి దేవాలయాలున్నాయి. సరస్వతీ ఆలయానికి భక్తుల తాకిడి యేడాదంతా ఉండేది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి భక్తులు వచ్చేవారు. కరోనాకు ముందు.. నిత్యం 3-4 వేల మంది భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు 50-100 మందికి మించి రావడం లేదు. గతం లో రోజుకు రూ.90 వేల నుంచి లక్ష వరకు ఆదా యం వచ్చే ది. ప్రస్తుతం రోజుకు రూ.5 వేలు రావడమే గగనంగా మారింది. ఆన్లైన్లో కూడా టికెట్ బుకింగ్ చేసుకోవడం లేదు. తీర్థ ప్రసాదా లు, అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, సా మూహిక, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు, వాహన పూజలు చేయించుకోవడం లే దు. అన్నదానం పూర్తిగా నిలిపేశారు. ఆర్జిత సేవ లు నిలిచిపోగా.. కేవలం దర్శనాలు మా త్రమే ఉ న్నాయి. పూజారులు అమ్మవారికి నిత్య పూజలు మాత్రమే చేస్తున్నారు. భక్తుల కోసం భౌతిక దూ రం పాటించేలా డబ్బాలు గీశారు. థర్మల్ స్క్రీనిం గ్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. గర్భగుడి లోపలికి అనుమతించడం లేదు.
గూడెంలో తీర్థ ప్రసాదాలు లేవు..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూ డెంలో గూడెం సత్యనారాయణస్వామి దేవాల యం ఉంది. కార్తీక, శ్రావణ మాసాల్లో భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. మంగళవారం శ్రా వణ మాసం ప్రారంభం కాగా.. భక్తులు పదుల సంఖ్యలోనే వచ్చారు. ఇక్కడ తీర్థ ప్రసాదాలు లేకపోగా.. దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆన్లైన్ పూజలు కూడా ఎవరూ చేసుకోవడం లేదు. ఆన్లైన్ టికెట్లు విక్రయించడం లేదు. గతేడాది రూ.1.58 కోట్ల ఆదాయం సమకూరగా.. నాలుగు నెలల నుంచి ఆదాయం రావడం లేదు. వచ్చే కార్తీక మాసంలోపు కరోనా తీవ్రత తగ్గితే.. భక్తులు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో లక్ష్మీసత్యనారాయణస్వా మి ఆలయానికి భక్తులు రాకపోవడంతో.. పూజారులు నిత్యపూజలు మాత్రమే చేస్తున్నారు. గతం లో పూజలు, వ్రతాలు చేసేవారు. గతంలో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం భక్తులు లేక వెలవెలబోతున్నది.
పడిపోయిన ఆదాయం..
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కది లి పాపహరేశ్వరాలయం, కాల్వ లక్ష్మీనర్సింహాస్వా మి ఆలయాల పరిస్థితి అలాగే ఉంది. తీర్థ ప్రసాదాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు లేకపో గా.. కేవలం దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తుల సంఖ్య తగ్గడంతో.. ఆదాయం పూర్తిగా పడిపోయింది. మార్చిలో కదిలి ఆలయానికి రూ.4.13 లక్షలు, కాల్వలో రూ.4.27 లక్షల ఆదాయం సమకూరింది. అప్పటి నుంచి భక్తులు రాకపోవడంతో ఆదాయం లేదు. శ్రావణ మాసం ప్రారంభమైనా 100 మంది కూడా భక్తులు రాలే దు. సాధారణంగా కదిలిలో సోమవారం 2-3వేల మంది వచ్చేవారు. కాల్వలో శనివారం పెద్ద ఎత్తు న భక్తులు వచ్చేవారు. ఈ రెండు దేవాలయాలకు గతంలో నిర్మల్, ఖానాపూర్, భైంసాతోపాటు మహారాష్ట్రలోని భోకర్, ధర్మాబాద్, నాందేడ్, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే వారు. నాలుగు నెలలుగా అసలే రావడం లేదు.
వినాయక చవితి, దుర్గామాత ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో..
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోనా ల పండుగ ముగిసింది. చాలా వరకు ఎవరికి వారే బోనం సమర్పించి, ఇండ్లకే పరిమితమయ్యారు. తాజాగా శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మా సంలో మహిళలు పసుపుబొట్టు ఇచ్చుకుంటారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ సారి పసుపుబొట్టు ఇచ్చుకునే పరిస్థితి లేదు. శ్రావణమాసంలో సోమ, శనివారాల్లో దేవాలయాలకు భక్తులు అధికంగా వెళ్తుంటారు. శ్రావణం ప్రారంభమైనా దేవాలయాలకు భక్తులు పెద్దగా వెళ్లడం లేదు. మరోవైపు రానున్న రోజుల్లో వినాయక చవితి, దుర్గామాత నవరాత్రోత్సవాలు ఉం టాయి. పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. బాసరలో అమ్మవారి నవరాత్రోత్సవాలు ఉంటాయి. విగ్రహాల వద్ద సామూహిక పూజలు చేస్తుంటారు. కొవిడ్-19 కారణంగా ఈ నవరా త్రోత్సవాలు ఏ విధంగా ఉంటాయో.. ఎలా నిర్వహిస్తారో.. అనేది సమస్యగా మారింది. వైరస్ తీవ్ర త ఇలాగే ఉంటే.. సామూహికంగా జరిగే నవరా త్రోత్సవాల నిర్వహణ కష్టంగా మారనుంది. కాగా.. కరోనాతో బాసర ఆలయానికి ఆదాయం తగ్గిందని, ఆలయాలు తెరుచుకున్నా భక్తులు రావ డం లేదని ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు.
బాసర ఆలయంలో నిత్య పూజలు చేస్తు న్నాం. అక్షరాభ్యాస పూ జలు మాత్రం నిర్వహించడం లేదు. అక్షరా భ్యాసాలు చిన్న పిల్లల కు చేయిస్తారు. వారికి అనుమతి లేదు. దీంతో బాసర ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఆన్లైన్ పూజలు నిర్వహిస్తున్నా భక్తులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. - ప్రవీణ్ పూజారి
ఆలయం వెలవెల బోయింది..
ప్రతి సంవత్సరం జూ లై మాసంలో అమ్మవారి దర్శనానికి వస్తా. మంగ ళవారం దర్శనం చేసుకు నే సందర్భంగా పదుల సంఖ్యలో భక్తులు రావ డం చూశా. ఆశ్చర్యం కలి గింది. రోజూ వేల సం ఖ్య లో బాసరకు వచ్చే భక్తులు నేడు పదుల సం ఖ్య లో వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అం తా వెలవెలబోయింది. కరోనా మహమ్మారి త్వరగా పోవాలని అమ్మవారిని వేడుకున్నా..- కైలాస్, భక్తుడు(ధర్మాబాద్)