సాగునీటి రంగానికి ప్రాధాన్యం

సారంగాపూర్ : సాగునీటి రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. స్వర్ణ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకోవడంతో నిధులు మంజూరు చేయించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. మండలంలోని రైతులు తుకాలు(వరి నారు) పోసుకొని, త్వరగా నాట్లు వేసుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేయించామన్నారు. పను లు పూర్తి కాగా, త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అడెల్లి నుంచి బోథ్ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సిర్గాపూర్ ఎక్స్‌రోడ్డు నుంచి కౌట(బి) వరకు రెండు వరుసల రహదారి మంజూరైందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ సుశీల్‌కుమార్, ఈఈ మల్లికార్జున్, డీఈ అనిల్, తహసీల్దార్ తుకారాం, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమి టీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, సర్పంచ్ సిద్ధిఖీ, ఎంపీటీసీ భోజారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఇప్ప మధూకర్‌రెడ్డి, జేఈలు మధుపాల్, దేవేందర్, నాయకు లు రాంకిషన్‌రెడ్డి, ఆది, మల్లేశ్, చందు, నర్సారెడ్డి పాల్గొన్నారు.
నందిగుండం దుర్గామాతకు పట్టు వస్ర్తాల సమర్పణ
నిర్మల్ అర్బన్ : ఆషాఢమాసం బోనాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాతకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కుటుంబ సమేతంగా పట్టు వస్ర్తాలు, బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అల్లోల దంపతులు అమ్మవారికి తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు రాష్ట్ర సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో బోనాలను నిరాడంబరంగా, భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. నందిగుండం దుర్గామాత ఆలయాన్ని రూ.50లక్షలతో నిర్మించినట్లు గుర్తుచేశారు. త్వరలోనే కాళీమాత ఆలయానికి రహదారి నిర్మిస్తామని చెప్పారు. మంత్రి వెంట అల్లోల మురళీధర్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపకుడు కొండాజీ వెంకటాచారి, ఆలయ అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబ ఉన్నారు.
క్యాంప్ కార్యాలయం, ఇంటి ఆవరణలో పది గంటలకు పది నిమిషాలు..
ఆదివారం ‘పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా మంత్రి అల్లోల, తన ఇంటి ఆవరణలో మట్టిని, పిచ్చి మొక్కలను తొలగించారు. క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఏపుగా పెరిగిన మొక్కలను కత్తిరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములై, ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు రాజు, మతీన్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొవిడ్-19 వ్యాక్సిన్ రవాణాకు స్పెషల్ ట్రక్ బీ సేఫ్ ఎక్స్‌ప్రెస్
- టిక్‌టాక్‌పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు