బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jul 19, 2020 , 02:32:06

రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అభినందనీయం

రోడ్డు విస్తరణకు ప్రజల సహకారం అభినందనీయం

నిర్మల్‌ అర్బన్‌ : రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని నాయుడి వాడ కాలనీలో రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అంతర్గత రోడ్లను విస్తరిస్తున్నామని తెలిపారు. దీంతో ఇరుకైన రోడ్లతో కలుగుతున్న ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. ప్రజలు  ఇదే విధంగా అన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తే అన్ని రంగాల్లో మున్సిపాలిటీ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఆయన వెంట కాళేశ్వర ఆలయ డైరెక్టర్‌ కొరిపెల్లి దేవేందర్‌ రెడ్డి, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, మేడారం ప్రదీప్‌, మణికంఠ సాయినాథ్‌, తదితరులున్నారు.

కార్మికురాలి కుటుంబానికి పరామర్శ 

జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌ కాలనీలో పారిశుధ్య కార్మికురాలు బండిశీల జమున అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చైర్మన్‌ వెంట టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్‌ వేణు, సుధాకర్‌, తదితరులున్నారు.logo