ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Jul 19, 2020 , 01:47:29

పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయండి

పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయండి

భైంసా: ముథోల్‌ నియోజకవర్గంలో పరిశ్రమల ఏ ర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర పారిశ్రామిక, మౌ లిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లును ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి శనివారం కోరారు.   హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి   నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అందుబా టులో ఉన్నాయని, యువతకు అవకాశాలు కల్పిం చేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని  వినతి ప త్రం అందించారు. భూముల లభ్యతతో పాటు నీ టి వసతి, రైల్వే స్టేషన్‌ సదుపాయం సమీపంలో ఉందని, మహారాష్ట్ర సరిహద్దు, నిజామాబాద్‌ జి ల్లా కేంద్రానికి కూడా అతి దగ్గరగా ఉంటుందని వివరించారు. ఆహార శుద్ధి కర్మాగారాలు, పత్తి ఆ ధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఇదే విషయమై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించినట్లు ఎమ్మెల్యే  తెలిపారు కాగా, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌తో నివేదిక తెప్పించుకొని, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.