ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Jul 18, 2020 , 02:57:26

రైతుల సంక్షేమం కోసమే వేదికలు

రైతుల సంక్షేమం కోసమే వేదికలు

నార్నూర్‌: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం వేదికలు నిర్మిస్తున్నదని ఎంపీపీ ఆడ చంద్రకళ  పేర్కొన్నారు. శుక్రవారం గాదిగూడలో రైతు వేదికల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలోని రైతులు ఒకే చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి ఈ వేదికలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌  మోతీరాం, సర్పంచ్‌ మెస్రం జైవంత్‌రావ్‌, ఏవో జాడి దివ్య, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.  

బోథ్‌: మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను శుక్రవారం ఎంపీపీ తుల శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఏపీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ ఉన్నారు. 

రైతు వేదిక, విలేజ్‌ పార్కు ఏర్పాటుకు స్థలాల పరిశీలన

ఇచ్చోడ: మండలంలోని తలమద్రి గ్రామంలో రైతు వేదిక, విలేజ్‌ పార్కు ఏర్పాటు చేసేందుకు స్థలాలను శుక్రవారం ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, ఎంపీటీసీ కమల పరిశీలించారు. వారి వెంట సర్పంచ్‌ చిన్నయ్య, అధికారులు ఉన్నారు.  logo