బుధవారం 20 జనవరి 2021
Nirmal - Jul 18, 2020 , 02:58:52

తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ

తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ

  • n జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ    మహేందర్‌రెడ్డి అత్యవసర సమీక్ష
  • n పరిస్థితులపై ఆరా..       త్వరలో పట్టుకుంటామని స్పష్టం
  • n తనిఖీలు నిర్వహిస్తుండగా గుండెపోటుతో      తిర్యాణి ఏఎస్‌ఐ దేవ్‌రావ్‌ మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ , నమస్తే తెలంగాణ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం కొద్దిరోజులుగా ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నా యి. బోథ్‌కు చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌, డివిజన్‌ సభ్యులు వర్గేశ్‌, మంగు, అజ య్‌, రాము జిల్లాలోకి చొరబడ్డారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులు రెండుసార్లు చిక్కినట్లే చిక్కి చాకచక్యంగా తప్పించుకున్నారు. సోమవారం తప్పించుకున్న మావోయిస్టులు, మంగళవారం రాత్రి మరోసారి ఎదురుపడి తప్పించుకున్నారు. మరోవైపు మావోయిస్టులకు సహకరించి, భోజనం పెట్టారనే ఆరోపణలతో తుక్కుగూడపటేల్‌ అనంతరావ్‌ను అదుపులోకి తీ సుకొని, అతడు నేరం అంగీకరించడంతో జైలుకు పంపించారు.

జిల్లా పోలీసులతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష

కొద్ది రోజులుగా జిల్లాలోని తిర్యాణి అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాకు వచ్చారు. ఆసిఫాబాద్‌లోని జిల్లా పోలీసు కార్యాలయంలో నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరె డ్డి, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమా ర్‌, రామగుండం కమిషనర్‌ సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణువారియర్‌, అడిషనల్‌ ఎస్పీ సు ధీంద్ర, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ సురేశన్‌తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 500 మంది ప్రత్యేక పోలీసు బలగాలతో యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ నిర్వహించేందుకు నిష్ణాతులైన ప్రత్యేక గ్రేహౌం డ్స్‌, టీఎస్‌ఎస్‌పీ బలగాలలతో గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ఐజీ నాగిరెడ్డి కూడా జిల్లాను సందర్శించి పరిస్థితులపై ఆరా తీశారు. 

గుండెపోటుతో తిర్యాణి ఏఎస్‌ఐ మృతి

తిర్యాణి : తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న దేవ్‌రావ్‌ (54) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. తిర్యాణి అడవుల్లోకి మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం మాణిక్యాపూర్‌ గ్రామ పంచాయతీలో సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా గుండెలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకుని దేవ్‌రావును మండల కేంద్రంలోని 30 పడకల దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెం దినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం శాంతాపూర్‌ గ్రామానికి చెందిన దేవ్‌రావ్‌ రెండేళ్లుగా తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. 1989లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రజలు, తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండే దేవ్‌రావ్‌ హఠాత్తు మరణంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.logo