బుధవారం 12 ఆగస్టు 2020
Nirmal - Jul 16, 2020 , 02:39:11

రైతు సంక్షేమమే సీఎం ధ్యేయం

రైతు సంక్షేమమే సీఎం ధ్యేయం

  • రాష్ట్ర మంత్రి  అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • బీరవెల్లిలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన
  • ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నాటిన అమాత్యుడు
  • నిర్మల్‌లో విద్యుదాఘాతంతో కాలిపోయిన  నెట్‌ సెంటర్‌ పరిశీలన

సారంగాపూర్‌ : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని బీరవెల్లిలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు వేదిక ద్వారా రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దసరా నాటికి అన్ని చోట్ల రైతు వేదిక భవనాలను పూర్తిచేస్తామని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్‌, రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5వేలు, రైతుబీమా, పంటలకు గిట్టుబాటు ధర, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందించి ఆదుకుంటున్నదన్నారు. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. అనంతరం ‘హరితహారం’లో భాగంగా ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.  కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్‌రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఐర నారాయణరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ వంగ రవీందర్‌రెడ్డి, నిర్మల్‌ జడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ సుభాష్‌రావు, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్‌ మెంబర్‌ సయ్యద్‌ ఇస్మాయిల్‌, నాయకులు రాజ్‌మహ్మద్‌, రాంకిషన్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మధూకర్‌రెడ్డి, రాజు, గంగాధర్‌, నాగుల రాంరెడ్డి, కండెల భోజన్న, తహసీల్దార్‌ తుకారాం, ఎంపీడీవో సరోజ, ఏవో రాజశేఖర్‌రెడ్డి, ఏఈవో సుప్రియ పాల్గొన్నారు.

ఇంటర్‌నెట్‌ సెంటర్‌ పరిశీలన..

నిర్మల్‌ అర్బన్‌ : పట్టణంలోని ఈద్‌గాం కాలనీకి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీ నాయకురాలు అమ్రీన్‌ ఇంటర్‌ నెట్‌ సెంటర్‌ మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో కాలిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి అల్లోల బుధవారం పరిశీలించారు. అండగా ఉంటామని, ప్రభుత్వ సా యం అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌ రెడ్డి తదితరులున్నారు.logo