సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jul 16, 2020 , 02:39:12

వృక్ష సంపదతోనే పర్యావరణ రక్షణ

వృక్ష సంపదతోనే పర్యావరణ రక్షణ

జైనథ్‌: వృక్ష సంపదతోనే పర్యావరణ రక్షణ ఆధారపడి ఉంటుందని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ గోవర్ధన్‌ అన్నారు. మండలంలోని జామిని గ్రామంలో బుధవారం మొక్కలు నాటారు. ముందుగా సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా నాయకుడు చంద్రయ్య, సర్పంచ్‌ మోహన్‌, మాజీఎంపీటీసీ రేణుకాబాయి, నాయకులు భరత్‌, జగన్నాథ్‌ పాల్గొన్నారు. 

ఇచ్చోడ: మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమని ఎస్‌ఐ పుల్లయ్య పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా బుధవారం మండలంలోని మేడిగూడ గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో వెయ్యి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మడావి సులోచన, గ్రామ పటేల్‌ మడావి భీంరావ్‌, కుమ్రం భీం ఆశయ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు కుమ్రం కోటేశ్వర్‌ పాల్గొన్నారు. 

బేల: మండలంలోని శంషాబాద్‌ గ్రామంలో ఎస్‌ఐ సాయన్న మొక్కలు నాటారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ బిపిన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. logo