శనివారం 08 ఆగస్టు 2020
Nirmal - Jul 15, 2020 , 02:26:42

ఆక్రమణలకు అడ్డుకట్ట

ఆక్రమణలకు అడ్డుకట్ట

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా దట్టమైన అడవులకు పెట్టింది పేరు. ప్రతి యేటా 1,100 నుంచి 1,200 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవుతుంది. వీటికితోడు గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులతోపాటు వాగులు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటిలోని నీరు ను సద్వినియోగం చేసుకోవడంలో సమైక్య పాలకులు వైఫ ల్యం చెందగా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి  సారించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎస్సారెస్పీ, స్వర్ణ, కడెం, ఎల్లంపల్లి, నీల్వాయి, జగన్నాథపూర్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, పీపీరావు, ఎన్టీఆర్‌ సాగర్‌, సాత్నాల ప్రాజెక్టులు.. గడ్డెన్న, ర్యాలీ, గొల్ల, మత్తడివాగులు ఉన్నాయి. ఆం ధ్రాపాలకులు వీటి నిర్మాణం పూర్తి చేయకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రాజెక్టు గేట్లు, కాలువలు సక్రమంగా లేకపోవడంతో నీరంతా వృథాగా పోయింది. ఎగువ, పరీవాహక ప్రాంతం నుంచి వచ్చిన నీరు వృథాగా పోవడం తో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఖాళీ అయ్యేవి. దీంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ముంపు, చివరి భూములు అధికంగా కబ్జాకు గురయ్యేవి. తెలంగాణ సర్కారు వచ్చిన త ర్వాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంతో ప్రాజెక్టుల స్వరూపమే మారిపోయింది. ప్రాజెక్టులకు మరమ్మతులు, కాలువల ఆధునీకరణ చేయడంతో నీరంతా ఆగుతోంది. యేడాదంతా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి.  దీంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ముంపు, చివరి భూముల్లో నీరు నిలిచి ఉండడంతో  ఆక్రమణలు, కబ్జాలకు అడ్డుకట్ట పడింది.

మిషన్‌ కాకతీయతో ఆయకట్టుకు నీరు

ప్రాజెక్టుల నీటితో చెరువులు నింపడంతో యేడాదంతా నిండుకుండలను తలపిస్తున్నాయి.  నడి ఎండాకాలంలో నూ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) వరకు జలకళతో ఉ న్నాయి. దీంతో చెరువు లోపలి వరకు వెళ్లి దుక్కి దున్నడం, మట్టితో నింపి చదును చేసేందుకు వీలు లేకుండా పోయిం ది. ఇక మిషన్‌ కాకతీయ పథకంతో పెద్ద ఎత్తున చెరువులకు మరమ్మతులు చేశారు. చెరువుల తూములు బాగు చేయడం తో నీరు పూర్తిస్థాయిలో నిల్వ ఉంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2,702 చెరువులు ఉండగా.. వీటి కింద 2,97,721 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఉమ్మడి జిల్లాలో 40 ఎకరాల్లోపు ఆయకట్టు గల చెరువులు 1,314 ఉండగా.. వీటి కింద 22,642 ఎకరాలు..  40-100 ఎకరాల మధ్య ఆయకట్టు ఉన్నవి 730 ఉండగా.. వీ టికి కింద 42,778 ఎకరాలు, 100 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 658 ఉండగా.. 2,32,299 ఎకరాల కు సాగునీరు ఇస్తున్నారు. 

కబ్జాలు, ఆక్రమణలకు అడ్డుకట్ట

ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణ సమయంలో ముంపు భూములకు పరిహారం చెల్లించి అవార్డ్‌ పాస్‌ చేశారు. ఈ భూముల మ్యుటేషన్‌ పూర్తి చేసి.. రెవెన్యూ పహానీల్లో రైతుల పేర్ల స్థానంలో నీటిపారుదలశాఖ పేరిట రాయాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికీ రాయలేదు. దీంతో కొందరు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి. దీంతో వారు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, రైతుబంధు, పంట రు ణాలు, రుణమాఫీ వంటి పథకాల్లో లబ్ధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలోనూ భూములు వారి కబ్జాలో ఉండగా.. కొం దరు సొంతంగా సాగు చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు లీజుకు ఇవ్వగా.. కొందరు ఏకంగా క్రయవిక్రయాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు కలిసి జాయింట్‌ సర్వే చేపట్టాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, చెరువుల కింద సర్వే చేస్తుండగా.. ఇప్పటి కే ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద బాసర మండలంలో సర్వే పూర్తి చేసి ఇప్పటికే సరిహద్దు రాళ్లు పాతారు. దీంతో ఆక్రమణలు చేయకుండా.. నియంత్రించేందుకు వీలుంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద 2 వేల ఎకరాలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 600 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ సర్వే తర్వాత కబ్జాలు, ఆక్రమణలకు అడ్డుకట్ట పడనుంది.logo