ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Jul 15, 2020 , 02:26:45

వినూత్న ఆవిష్కరణలకు ఆహ్వానం

వినూత్న ఆవిష్కరణలకు ఆహ్వానం

ఆగస్టు 15వ తేదీన ఆన్‌లైన్‌ ద్వారా ప్రదర్శన  

ఆదిలాబాద్‌  కలెక్టర్‌ శ్రీదేవసేన

ఎదులాపురం : ‘ఇంటింటా ఇన్నోవేటర్‌' కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్‌లైన్‌ ద్వారా వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నదని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ దేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ (teamtsic. telangana. gov.in) అవకాశం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు జూలై 20వ తేదీలోగా 9100678543 వాట్సాప్‌ నంబర్‌కు పంపించాలని సూచించారు. వాటిని రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ పరిశీలించి, జిల్లా నుంచి ఐదింటిని ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయా జిల్లాలో ఆన్‌లైన్‌లో ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. రెండు నిమిషాల వ్యవధిలో రూపొందించిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించి నాలుగు ఫొటోలు, ఐదు పంక్తుల్లో ఆవిష్కరణల వివరాలు, ఆవిష్కర పేరు, వయసు, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, మొబైల్‌ నంబర్‌, జిల్లా, మండలం, గ్రామంతో పాటు ఇతర వివరాలు తప్పనిసరి పంపించాలని సూచించారు.


logo