గురువారం 21 జనవరి 2021
Nirmal - Jul 15, 2020 , 02:26:46

ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించాలి

ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించాలి

  • డీఆర్డీవో రాథోడ్‌ రాజేశ్వర్‌
  • నార్నూర్‌లో పనుల పరిశీలిన

నార్నూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం నార్నూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో స్థలాలు గుర్తించాలని అధికారులకు డీఆర్డీవో రాథోడ్‌ రాజేశ్వర్‌ సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం స్థలాల గుర్తింపులో అలసత్వం వీడాలని అధికారులను ఆదేశించారు. హరితహారం, కల్లాల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలతో పాటు పలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. వనాల్లో నాటే మొక్కలను వివరించారు. ఆయన వెంట ఎంపీడీవో గంగాసింగ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో జాదవ్‌శేషారావ్‌, ఎంపీవో భూక్యా శివ్‌లాల్‌, ఈసీ ఇందల్‌, సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌, సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ ఆడే సురేశ్‌, డైరెక్టర్‌ దుర్గే కాంతారావ్‌, ఉప సర్పంచ్‌ చౌహాన్‌ మహేందర్‌, తదితరులు ఉన్నారు.


logo