శనివారం 23 జనవరి 2021
Nirmal - Jul 14, 2020 , 03:38:28

రైతు వేదికలతో అన్నదాతకు మేలు

రైతు వేదికలతో అన్నదాతకు మేలు

ఉట్నూర్‌ రూరల్‌: రైతు వేదికలతో అన్నదాతలకు ఎంతో మేలు కలుగనున్నదని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు అన్నారు. మండలంలోని సాలేవాడ(కే) గ్రామంలో సోమవారం రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఎనిమిది రైతు వేదిక భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగారే భారత్‌, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.                           

బోథ్‌: రైతుల సమస్యలు పరిష్కరించడానికి రైతు వేదికలు నిర్మిస్తున్నామని ఎంపీపీ తుల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సొనాల గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు వేదిక భవన పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ జేఈ నర్సింగ్‌, వార్డుసభ్యులు, రైతులు, యువకులు పాల్గొన్నారు. logo