మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jul 14, 2020 , 03:38:36

పచ్చదనంతోనే పర్యావరణ రక్షణ

పచ్చదనంతోనే పర్యావరణ రక్షణ

  • lనేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌
  • lకొనసాగుతున్న హరితహారం

నేరడిగొండ: పచ్చదనంతోనే పర్యావరణ రక్షణ సాధ్యమని జడ్పీటీసీ అనిల్‌ అన్నారు. సోమవారం మండలంలోని సావర్‌గాం గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సావర్‌గాం యువజన సంఘం నాయకులు హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పం చ్‌ కల్యాణి, ఉపసర్పంచ్‌ పద్మ, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ నానక్‌సింగ్‌, నాయకులు ప్రతాప్‌సింగ్‌, మహేందర్‌, యువజన సంఘం నాయకులు చంద్రశేఖర్‌, ప్రకాశ్‌, ప్ర శాంత్‌, చంద్రకాంత్‌, అనిల్‌, కృష్ణ, సురేశ్‌, రాహుల్‌ పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆ వరణలో ఏఈ విష్ణు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. 

బోథ్‌: మొక్కలతోనే జీవ జాతుల మనుగడ సాధ్యమని తెలంగాణ గ్రామీణ బ్యాంకు కౌఠ (బీ) శాఖ మేనేజర్‌ కల్పేశ్‌ అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా మండలంలోని కౌఠ(బీ) గ్రామంలో టీజీబీ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చిలకాడి రవీందర్‌, గంగాధర్‌,  అశోక్‌రెడ్డి, బాపురెడ్డి, దయాకర్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి: చెట్లతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని హీరాపూర్‌ సర్పంచ్‌ నాగోరావ్‌ పేర్కొన్నారు. మండలంలోని గోపాల్‌పూర్‌ గ్రామంలో సోమవారం ఆయన మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం బోరుబావులతో పాటు మురుగు నీరు నిలిచిపోయిన ప్రాంతంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. కార్యక్రమంలో కారోబార్‌ తోడసం మారుతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

నార్నూర్‌: పర్యావరణ రక్షణ కోసం నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కోరారు. మండలంలోని జామడ గ్రామంలో పోలీస్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం రెండు వేల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మడావి ముక్తా రూప్‌దేవ్‌, యువకులు పాల్గొన్నారు.

భీంపూర్‌: భగవాన్‌పురా గ్రామంలో సోమవారం ఎస్‌ఐ ఆరిఫ్‌, ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సర్పంచ్‌  రేష్మా మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. logo