పీవీతో సాన్నిహిత్యం మరువలేనిది..

- భూ సంస్కరణల చట్టంలో ఆయన పాత్ర కీలకం
- ఎన్ని భాషలు వచ్చినా.. తెలుగుపైనే మమకారం..
- మాజీ మంత్రి చిలుకూరి రాంచంద్రారెడ్డి
ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ : “తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి పాములపర్తి వేంకట నరసింహారావు. ఆయన బహుభాషా కోవిదుడు. నేను వైఎస్సార్ మంత్రి వర్గంలో పని చేసినపుడు పీవీతో అధికంగా సాన్నిహిత్యం ఉండేది.” అని మాజీ మంత్రి చిలుకూరి రాంచంద్రారెడ్డి(సీఆర్ఆర్) జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సీఆర్ఆర్తో పీవీ గురించి ప్రస్తావించినపుడు ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రిగా పీవీ ఉన్నప్పుడు నిర్మల్ జిల్లాలోని సోన్‌కు పార్టీ సంబంధిత కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ నన్ను అక్కడ ఇన్చార్జిగా నియమించారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. భూసంస్కరణ చట్టానికి పీవీ ఆద్యుడు. 54 ఎకరాలకు పైగా ఉన్న భూములను భూస్వాములు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించగా అవి పేదలకు పంచారు. అప్పుడు నేను కూడా మా కుటుంబం నుంచి కొంత భూమిని అప్పగించా. దీనికి మా నాన్న సమ్మతించారు. జైనథ్‌లో ఉన్న మా సోదరి కూడా కొంత భూమి ఇచ్చింది. అలా ఆయన సంస్కరణలు ప్రభావశీలంగా ఉండేవి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి నవోదయ పాఠశాల కోసం ఎంతో కృషి చేశా. అది అంతిమంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు దక్కింది. ఇక పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా కులవృత్తుల మనుగడకు అప్పట్లోనే పథకం రూపొందించి వారికి ఆధునిక పరికరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో వందల సంఖ్యలో కులవృత్తిపై ఆధారపడిన కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రభుత్వ పాలనలో, పార్టీలో తీసుకునే నిర్ణయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన జాతీయస్థాయికి ఎదిగినా నిండు గంభీరంగా తెలుగు ఆహార్యంతో, భాషపై మక్కువతో సాదాసీదాగా ఉండేవారు. అదే సమయంలో లౌకిక, సోషలిస్టు భావాలతో ముందుకు పోయేవారు. పీవీకి చాలా భాషల్లో ప్రావీణ్యం ఉంది. అయినా మాతృభాషపై మమకారం ఉండేది. జాతి రత్నం పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ బిడ్డగా గర్వించాల్సిన విషయం. అయితే ఆయన ఆశయాలు నిర్మాణాత్మకంగా అమలు చేయాలి. ఆ మహామనిషికి శతకోటి వందనాలు.
తాజావార్తలు
- 100 రోజుల్లో అన్ని దేశాల్లో కొవిడ్ టీకాలు: డబ్ల్యూహెచ్ఓ డీజీ టెడ్రోస్
- సంక్రాంతి సినిమాల పరిస్థితేంటి?
- కొవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతం : డీహెచ్ శ్రీనివాసరావు
- ఢిల్లీలో జూలో బర్డ్ ఫ్లూ.. గుడ్లగూబలో వైరస్ లక్షణాలు
- తగ్గిన ఆదాయం: పెరిగిన రుణ స్కామ్‌లు
- అలా ఔటైనందుకు బాధ లేదు: రోహిత్ శర్మ
- సీఎం సహాయనిధి పేదలకు వరం : మంత్రి హరీశ్ రావు
- కరోనా టీకాలకు.. డప్పులు, పూజలతో స్వాగతం
- ఏంజెలా మెర్కెల్ వారసుడిగా అర్మిన్ లాస్చెట్
- నీటిగుంతలో మునిగి విద్యార్థి మృతి