సోమవారం 18 జనవరి 2021
Nirmal - Jul 12, 2020 , 01:31:09

కరోనాను జయించా..

కరోనాను జయించా..

  •  ప్రభుత్వ దవాఖానలోనే వైద్యం చేయించుకున్నా.. 
  •  కొవిడ్‌-19 నుంచి కోలుకున్న ఆడెపు సాయిచరణ్‌ మనోగతం..
  • నాపేరు ఆడెపు సాయి చరణ్‌. మాది నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం స్వర్ణ గ్రామం. జిల్లా ఏరియా దవాఖానలో మూడేళ్లుగా వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్నా. నాకు జూన్‌ 5న కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆందోళన చెందొద్దని వైద్యులు చెప్పిన్రు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉన్నా. నిర్మల్‌ జిల్లా ఏరియా దవాఖానలో సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖాన తరహాలో వైద్యం అందించారు. మూడు పూటలా పౌష్టికాహారం, పండ్లు, కోడిగుడ్లు ఇచ్చారు. డ్యూటీ డాక్టర్లు ఆప్యాయంగా పలకరిస్తూ, పరీక్షలు నిర్వహించేటోళ్లు. నాతోపాటు మిగతా రోగులకు మానసిక ధైర్యం కల్పించిన్రు. ఇక్కడి డాక్టర్లు అందించిన వైద్యంతోనే కోలుకుని జూన్‌ 20న ఇంటికి వెళ్లా. మరో పది రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నా.  ప్రభుత్వ దవాఖానల్లోనే నాణ్యమైన వైద్యం అందుతున్నది. కానీ.. కొందరు సర్కారు దవాఖానలపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి సరికాదు.      - నిర్మల్‌ అర్బన్‌