సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jul 12, 2020 , 01:31:08

అర్బన్‌ ఫారెస్ట్‌ అభివృద్ధి దిశగా..

అర్బన్‌ ఫారెస్ట్‌ అభివృద్ధి దిశగా..

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా హరితహారానికి శ్రీకారం చుట్టింది. కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో దట్టమైన అడవులు ఉండగా, సమైక్య పాలనలో పెట్రేగిన స్మగ్లర్ల  కారణంగా అంతరించే దశకు చేరుకున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డాక, సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని రాష్ట్ర సర్కారు అడవులకు పూర్వవైభవాన్ని తేవడానికి పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో మావల పార్కును హరితవనంగా మార్చింది. జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న దుర్గానగర్‌, కేఆర్‌కే కాలనీ సమీపాల్లో 3 వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నది.         - ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో అర్బన్‌ పార్కుల  అభివృద్ధికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆరో విడుత హరితహారంలో భాగంగా అడవుల పు నర్జీవంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అటవీ ప్రాంతా ల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఐదేళ్లుగా అటవీప్రాంతాల అభివృద్ధికి తీసుకున్న చర్యల కారణంగా అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. జి ల్లా కేంద్రానికి సమీపంలో మావల అడవులు 3950 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. స్మగ్లర్ల వేటు కారణంగా ఈ అటవీ ప్రాంతం పలుచబడింది. మూడేళ్ల కిందట అధికారులు రూ. 3 కోట్లతో వెయ్యి ఎకరాల్లో మావల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. గతంలో నరికివేతకు గురైన చెట్లను మొదళ్లు స హజంగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు పలుచబడ్డ ప్రాంతాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేశారు. ఫలితంగా మావ ల అటవీ ప్రాంతం దట్టమైన అడవిని తలపిస్తుండగా, దీని కి ‘ఆదిలాబాద్‌ హరితవనం’గా నామకరణం చేశారు. మా వల అటవీ ప్రాంతంలోని వెయ్యి ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఆహ్లాదం, అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సందర్శకులు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు రెండు గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రవేశద్వారాలను ఆకట్టుకునేలా నిర్మించా రు. అటవీ అందాలు వీక్షించేలా వాచ్‌ టవర్‌ను ఏర్పాటు చేశా రు. అడవిలో అంతర్గత రహదారులతో పాటు ఐదు కిలోమీటర్ల మేర వాకింగ్‌, సైకిల్‌ ట్రాక్‌ నిర్మించి.. చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులను సమకూర్చారు. యోగా షెడ్‌ను కూడా నిర్మించారు. అటవీ ప్రాంతానికి ఆనుకొని మావల చె రువు ఉండడంతో చిన్నారులకు బోటింగ్‌తో పాటు పెద్దవారికి స్టీమర్‌ బోటింగ్‌ వసతిని కూడా కల్పించారు. వీటితో పా టు పార్కు సందర్శనకు వచ్చే వారి కోసం సాహస క్రీడలను కూ డా అందుబాటులో ఉంచారు.

 2950 ఎకరాల అభివృద్ధికి చర్యలు

అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకుల అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న దుర్గానగర్‌, కేఆర్‌కే కాలనీ శివారు ప్రాం తాల్లోని అడవులను కూడా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అధికారులు గతంలో రూ పొందించిన ప్రణాళికలకు ప్రభుత్వ ఆమోదం లభించింది. రెండు కాలనీల శివారులో ఉన్న 2950 ఎకరాల అటవీ ప్రాం తం పూర్వవైభవాన్ని సంతరించుకునేలా పనులు చేపడుతున్నారు. అటవీ ప్రాంతం చుట్టూ కందకాలు తవ్వడంతో పాటు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. నరికివేతకు గురైన చెట్ల మొదళ్లు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పలుచగా ఉన్న ప్రాంతా ల్లో మొక్కలు నాటుతున్నారు. అటవీ జంతువుల కోసం గడ్డి క్షేత్రాలు, స్మృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారు. వాకింగ్‌ ట్రాక్‌ లు, వాచ్‌ టవర్లు నిర్మిస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు కూడాసౌకర్యాలు కల్పిస్తున్నారు. 

పటిష్టమైన ప్రణాళికలు

జిల్లాలో అడవులను అభివృద్ధి చేసేందుకు పటిష్టమైన ప్రణాళి కలు తయారుచేసి అమలు చేస్తు న్నాం. 3950 ఎకరాల్లో విస్తరిం చి ఉన్న మావల అటవీ ప్రాం తంలో ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో దట్టమైన అడవులు ఏర్పడ్డాయి. దుర్గానగర్‌, కేఆర్‌కే కాలనీ సమీపంలోని 3వేల ఎకరాల్లో  అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాకులను అభివృద్ధి చేస్తున్నాం. గతంలో నరికివేతకు గురైన చెట్లు సహజంగా పెరిగేలా చర్యలు తీసు కుంటున్నాం. మైదాన ప్రాంతాల్లో మొక్కలను నాటుతున్నాం.  - ప్రభాకర్‌, జిల్లా అటవీశాఖ అధికారి 


logo