శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Jul 11, 2020 , 00:23:00

రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో

 రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయాలని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్నిజిల్లాల వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, వానకాలం సీజన్‌లో అన్ని జిల్లాల్లో నియంత్రిత సాగు విధానం అమల్లోకి వచ్చినందున పంట వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ రకం పంట వేశాడో ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, వ్యవసాయశాఖ అధికారులు వీణ, వినయ్‌బాబు, వసంత్‌రావు, ప్రవీణ్‌కుమార్‌, స్రవంతి, నాగారాజు పాల్గొన్నారు.