మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Jul 10, 2020 , 02:35:58

పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

భైంసా: భైంసా పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. పట్టణంలో మార్కెట్‌ యార్డు, డంప్‌ యార్డు, అర్బన్‌ పార్కు ఏర్పాటు కోసం గడ్డెన్న వాగు ప్రాజెక్టు, ఆర్టీసీ డిపో పరిసర ప్రాంతాలను గురువారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మార్కెట్‌ యార్డులో రోడ్లు, వసతులు కల్పిస్తామని తెలిపారు. డంప్‌ యార్డులో తడి, పొడి చె త్త వేరు చేసేందుకు సెగ్రిగేషన్‌ షెడ్డు ఏర్పాటు చేయించనున్న ట్లు చెప్పారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా అర్బన్‌ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్‌ ఏ భాస్కర్‌ రావు, ఆర్డీవో రాజు, మున్సిపల్‌ వైస్‌ చైర్మ న్‌ జాబీర్‌ హైమద్‌, తహసీల్దార్‌ నర్సయ్య, ఉన్నారు.    


logo