సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jul 09, 2020 , 00:42:44

ప్రకృతి వనాలకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రకృతి వనాలకు గ్రీన్‌సిగ్నల్‌

నిర్మల్‌ టౌన్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వనాలపై దృష్టి పెట్టింది. ఈ యేడాది ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామం లో వీటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మొ త్తం 396 పంచాయతీలుండగా.. ఇప్పటికే 390 గ్రామాల్లో అధికారులు స్థలాలను గుర్తించారు. మిగతా ఆరు చోట్ల ఈ నెల 15లోగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. కడెం, ఖానాపూర్‌, పెంబి, దస్తురాబాద్‌,  కుభీర్‌, తానూరు,  కుం టాల, సారంగాపూర్‌, మామడ మండలాల్లోని గిరిజన గ్రా మాల్లో అటవీశాఖ ఆధీనంలోని ఖాళీ స్థలాలను గుర్తించారు. ఆయా చోట్ల అటవీశాఖ అధికారులు అనుమతులు ఇ వ్వడంతో  ప్రకృతి  వనాలు నిర్మించేలా అధికారులు  చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటికలు,  తడి,  పొడి చెత్త, సెగ్రిగేషన్‌ షెడ్లు, ఇంకుడు గుం తలు,  నర్సరీలను ఏర్పాటు చేసింది. 

స్థలాల సేకరణ పూర్తి..

జిల్లాలో ప్రకృతి  వనాల కోసం స్థలాలను గుర్తించినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఒక్కో గ్రామంలో ఎకరం స్థలం  గుర్తించి 4వేల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇందులో 200 మీటర్ల ట్రాక్‌తో పాటు సేద తీరేందుకు సిమెంట్‌ కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభు త్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. నెల రోజులుగా జిల్లా పంచాయతీరాజ్‌, రెవెన్యూ, అటవీశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ప్రత్యేక పర్యవేక్షణలో స్థలాల ఎంపికను పూర్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ఎంపిక చేసిన స్థలాల్లో ఆగస్టు 1 నుంచి మొక్కలు నాటానున్నారు. ఈ వనాల్లో ప్రధానంగా నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్లు, డెకరేషన్‌,  తీగజాతి మొక్కలు, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణం జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కొన్ని గ్రామాల్లో స్థలాల కొరత ఉందని, అయితే అర ఎకరంలోనైనా ప్రకృతి వనాలను ఏర్పాటు  చేయాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రకృతి వనాల నిర్మాణాలు సెప్టెంబరులోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా  పెట్టుకున్నారు. నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలు ఉన్నాయని, దీంతో ప్రకృతి వనాల్లో నాటేందుకు ఎలాంటి కొరత లేదని అధికారులు పేర్కొంటున్నారు. logo