సెల్యూట్.. 108 ఆపత్కాలంలోనూ మెరుగైన సేవలు

కరోనా పాజిటివ్.. ప్రస్తుతం ఈ మాట వినిపిస్తేనే ప్రతి ఒక్కరూ వణుకుతున్నారు. ఓ వాడలోనో.. గ్రామంలోనో, ఫలానా వ్యక్తికో పాజిటివ్ వచ్చిందని తెలిస్తే చాలు ఆవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కాని..కరోనా వచ్చిన వ్యక్తిని అతి జాగ్రత్తగా, అతి వేగంగా దవాఖానకు చేరుస్తూ, ముందుగా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు 108 ఉద్యోగులు.. నిర్మల్ జిల్లాలో మూడు నెలల్లో 250 మందిని దవాఖానకు చేర్చగా, వీరిలో పాజిటివ్ కేసులు, అనుమానిత లక్షణాలు ఉన్నవారు ఉన్నారు. - నిర్మల్ టౌన్
ప్రస్తుతం ఎలాంటి ఆపద వచ్చినా ప్రతి ఒక్కరికీ ముందు గా గుర్తొచ్చేది.. 108.. కరోనా వైరస్ విజృంభణలో కూడా ఆ వాహన సిబ్బంది తమ సేవలతో ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇప్పటివరకు 108 సేవల ద్వారా 250కి పైగా కరోనా వైరస్ అనుమానాస్పద కేసులను దవాఖానకు చేర్చగా.. కోలుకున్న 25 మందిని తమ అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వీరు సేవలను అందిస్తున్నారు. నిర్మల్, భైంసా, ముథోల్, ఖానాపూర్‌తో పాటు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో విదేశాల నుంచి వచ్చిన వారికి, ఇతర రాష్ట్రాల్లో ఉండి వచ్చిన వారి నుంచి వైద్య సిబ్బంది శాంపిళ్లు సేకరిస్తున్నది. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని వీరు వెంటనే గాంధీ దవాఖానకు తరలిస్తున్నారు. గాంధీ దవాఖానకు 30 మందిని తరలించగా.. ఫీవర్ దవాఖానకు ఒకరు, కింగ్ కోఠి దవాఖానకు నలుగురిని తరలించారు.
ఈ వాహనాల సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తూనే జనాలను చైతన్యం చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని, వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని వైద్య సిబ్బంది గుర్తించిన వెంటనే హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తున్నారు. ఇందులో పని చేస్తున్న పైలెట్లతో పాటు ఈఎంటీలు తమకు వైరస్ సోకకుండా రక్షణ దుస్తులను ధరిస్తున్నారు. ఎక్కడి నుంచి ఏ కాల్ వచ్చినా అరగంటలోనే అక్కడికి చేరుకుంటు న్నారు. వైరస్‌తో ఎలాంటి భయాందోళన అవసరం లేదని, బాధితులకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు నిర్మల్ 108 ఉద్యోగులు పేర్కొంటున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారితో పాటు అనుమానితులను దవాఖానలకు తరలిస్తున్నాం. బాధితులు మనోధైర్యం కోల్పోకుండా అవగాహన కల్పిస్తున్నాం. వైరస్ సోకిన వారు భయపడాల్సిన పని లేదని సకాలంలో వైద్యం చేయించుకోవాలని సూచిస్తున్నాం. వ్యాధి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నాం. ప్రజల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. మాస్కులు లేకుండా బయటకు రావడం లేదు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి కూడా అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నాం. మేం కూడా అవసరమైన జాగ్రత్తలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో సేవలు అందించడం సంతృప్తిగా ఉంది. -జీవన్, ఈఎంటీ, నిర్మల్
తాజావార్తలు
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్‌ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భారత్ టాప్
- దీప్‌సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్