మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Jul 07, 2020 , 23:59:52

విరివిగా మొక్కలు నాటాలి

విరివిగా మొక్కలు నాటాలి

 దస్తురాబాద్‌: భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కోరారు. దస్తురాబాద్‌ మండలంలో మంగళవారం  ఆమె విస్తృతంగా పర్యటించారు. దేవునిగూడెం, ఆకొండపేట, మున్యాల, పెర్కపల్లె గ్రామాల్లో, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోనే పెర్కపల్లె గ్రామంలో  మొట్టమొదటిసారిగా నిర్మించిన చెత్తను వేరు చేసే సెగ్రిగేషన్‌ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలోని మున్యాల గ్రామ మాజీ సర్పంచ్‌ సిర్ప సంతోష్‌ తల్లి సుశీల చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన రాజాగౌడ్‌ కొన్ని రోజుల క్రితం తాటి చెట్టు నుంచి ప్రమాదవశాత్తు జారి పడడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సింగరి కిషన్‌, జడ్పీటీసీ సంతపూరి శారద, సహకార సంఘం చైర్మన్‌ శైలజ, తహసీల్దార్‌ బత్తుల విశ్వంభర్‌, ఎంపీడీవో క్రాంతి, ఎంపీటీసీ సునిత, ఆయా గ్రామాల సర్పంచ్‌ లు నిమ్మటతోట రాజమణి, అంజన్న, దుర్గం పోశలింగం, దుర్గం శంకర్‌, అప్పని ప్రభాకర్‌, ఉప సర్పంచ్‌లు నరేశ్‌, రాజేశ్‌, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ముడికే ఐలయ్య యాదవ్‌, దాసరి సుధాకర్‌, ఆయా గ్రామాల అధ్యక్షులు, నాయకులు శివయ్య, సంతోష్‌, విలాస్‌ యాదవ్‌, రాజనర్సయ్య, మల్లేశ్‌, భూమన్న, రాములు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.