బుధవారం 05 ఆగస్టు 2020
Nirmal - Jul 07, 2020 , 23:58:16

బాసర కోవెలకు కొత్తందాలు

బాసర కోవెలకు కొత్తందాలు

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం బాసరను సందర్శించి రూ. 50 కోట్లు ఇటీవలే మంజూరు చేశామని, మరిన్ని నిధులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని చెప్పిన విషయం తెలిసిందే. కాగా, బాసరలో భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు న్న నేపథ్యంలో అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో భక్తుల ఇబ్బందులు తీరిపోనున్నాయి. 

మొదటి విడుతగా రూ.5 కోట్లతో పనులు..

అభివృద్ధిలో భాగంగా బాసర క్షేత్రంలో మొదటి విడుతగా రూ. 5కోట్లతో రానున్న శ్రావణ మాసంలో అభివృద్ధి పను లు ప్రారంభించనున్నారు. భక్తులు విడిది చేసేందుకు అతిథి గృహాలు తక్కువగా ఉన్నాయి. నేపథ్యంలో ఆలయం వద్ద ఉన్న యాదగిరి గుట్ట, శ్రీశైలం, ద్వారక తిరుమల, వేములవాడ తదితర అతిథి గృహాలపైన మరో అంతస్తు నిర్మించి దాదాపు 20 ఏసీ గదులను ఏర్పాటు చేయనున్నారు. లడ్డూ కౌంటర్‌కు వెళ్లే మార్గంలో భక్తులు విడిది చేసేందుకు వీలుగా షెడ్లను నిర్మించనున్నారు. ఆలయం నుంచి వ్యాస గుహకు వెళ్లే మార్గం, వ్యాస మహర్షి ప్రధానద్వారం వద్ద షెడ్లను నిర్మించే చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా భక్తులు బాసరకు వస్తుంటారు. వారు ఇంటి నుంచే భోజనం తీసుకొస్తారు. ఈ షెడ్ల కింద కూర్చొ ని తినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. మహంకాళి ఆలయం నుంచి వ్యాసమహర్షి ఆలయం దాకా టీటీడీ వంద రూముల గెస్ట్‌హౌస్‌ నుంచి ఆలయ ఉత్తర ద్వారం వరకు ప్రహరీని నిర్మించనున్నారు. ఈ పనులకు టెండర్లు ముగిశాయి. ఈ శ్రావణమాసంలోనే పనులు ప్రారంభించనున్నారు. 

రూ.126కోట్లతో ప్రణాళికలు..

బాసర క్షేత్ర రూపురేఖలు త్వరలోనే మారిపోనున్నాయి. చిన్నారుల అక్షరాభ్యాసాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక మండపాలు, క్యూ కాంప్లెక్స్‌లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, గోదావరి పుష్కర ఘాట్ల వద్ద భక్తులు బట్టలు మార్చుకునే గదులు, వాస్తుకు అనుగుణంగా ఈశాన్యంలో కోనేరు నిర్మాణం, తదితర వాటికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను విడుదల చేసింది. పనులు ప్రారంభించాక మిగతా బడ్జెట్‌ను కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. గతంలో ఆలయ అధికారు లు, ఆర్కిటెక్చర్‌ ఆనందసాయి, స్తపతి వల్లినయగాం అమ్మవారి క్షేత్రాన్ని సందర్శించి వాస్తుకు అనుగుణంగా ఆలయం లో తగు మార్పులు చేసి మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాసర ఆలయంపై దృష్టి పెట్టడంతో జిల్లా వాసులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గర్భగుడి విస్తరణ..

సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఉన్న గర్భగుడిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రూ.2.50 కోట్లతో ఆలయ గర్భగుడిని పూర్తిగా తొలగించేసి యాదగిరి గుట్ట తరహాలో కృష్ణ శిలలతో ని ర్మించనున్నారు. దీనికి శృంగేరీ పీఠాధిపతులు కూడా అనుమతించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి మంత్రి ఐకేరెడ్డి తీసుకెళ్లి అనుమతి రాగానే పనులు ప్రారంభించనున్నారు. గర్భగుడిలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లు ఉంటారు. భక్తులు సరస్వతీ అమ్మవారిని మాత్రమే దర్శించుకుంటున్నారు. కానీ పక్కన ఉన్న మహాలక్ష్మీ అమ్మవారు కనిపించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్ర త్యామ్నాంగా నూతనంగా కృష్ణ శిలలతో గర్భగుడిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

త్వరలోనే ఆలయ అభివృద్ధి..

బాసర క్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు ఎదురుకాకుండా త్వరలోనే అభివృద్ధి పను లు ప్రారంభిస్తాం. ప్రస్తుతం రూ.5 కోట్లతో మొ దటి విడుత పనులు శ్రావణ మాసంలో ప్రారంభిస్తాం. ప్రభుత్వ అనుమతులు వచ్చాక మిగతా పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. - వినోద్‌రెడ్డి, ఈవోlogo