బుధవారం 05 ఆగస్టు 2020
Nirmal - Jul 07, 2020 , 02:20:08

పేదల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌

పేదల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌

  • డీఎస్పీ వెంకటేశ్వర్‌రావ్‌
  • ఘనంగా జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి

ఎదులాపురం : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌ అని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావ్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేం ద్రంలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ 34వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ చౌక్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నవ భారత నిర్మాణానికి కృషిచేసిన మహనీయుడు అని పేర్కొన్నా రు. జగ్జీవన్‌రామ్‌ చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించిన నాయకుడని తెలిపారు. కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన నేత అని,  సంక్షేమ రాజ్యస్థాపనకు నాంది పలికిన సంస్కర్త అని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి జగ్జీవన్‌ రామ్‌ సేవలు అభినందనీయమని మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రే మేందర్‌ పేర్కొన్నారు. దళిత సంఘం ఆధ్వర్యం లో వేడుకలు నిర్వహించారు. ఇందులో దళిత సంఘం నాయకులు రత్నజాడే ప్రజ్ఞ కుమార్‌, దుర్గం శేఖర్‌, బాలశంకర్‌, మల్లెల స్వామి, నక్క రాందాస్‌, మల్యాల మనోజ్‌, రాజు, తదితరులు ఉన్నారు. అనంతరం సాంఘిక సంక్షే మ శాఖ కార్యాలయ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి శంకర్‌, డీఎస్‌డీవో ప్రవీణ్‌కుమార్‌, డీబీసీడీవో ఆశన్నతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


logo