అంతర్ జిల్లా బైక్ దొంగ అరెస్టు

29 ద్విచక్రవాహనాలు సీజ్
ఏసీపీ శ్రీనివాస్ వెల్లడి
నిజామాబాద్ సిటీ : అంతర్ జిల్లాల్లో బైక్‌ల చోరీకి పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నిజామాబాద్‌లోని ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వతేదీన జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో నిర్మల్ జిల్లా భైం సాకు చెందిన హైమద్ హుస్సేన్ బైక్‌పై వెళ్తున్న సమయంలో పోలీసులు ఆపారు. బైక్‌కు సంబంధించి పత్రా లు చూపాలని అడగడంతో సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. దీంతో హైమద్ హుస్సేన్ బైక్‌లను దొంగతనం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు బైక్‌లు దొంగతనం చేసినట్లు విచారణలో తెలిపాడు. నిజామాబాద్ నగరంలోని ఆనంద్‌నగర్‌లో కొన్ని రోజుల క్రితం ఓ బైక్ ఎత్తుకెళ్లాడు. దాదాపు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనం చేసిన 29 ద్విచక్రవాహనాలు రికవరీ చేసి సీజ్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. 2018లో నిజామాబాద్‌లోని మూడో టౌన్ పరిధిలో దాదాపు 17 ద్విచక్రవాహనాలు దొంగిలించిన కేసులో ఇత డిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల శిక్ష పడడంతో ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి బైక్ దొంగతనాలు చేస్తుండగా పట్టుకు న్నామని ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, ఎస్ఐ జాన్‌రెడ్డి, ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుల్ వేణుగోపాల్, చంద్రశేఖర్, అప్సర్‌ను ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.
తాజావార్తలు
- కుమారుడి హత్యకు తండ్రి 3 లక్షల సుపారీ
- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చర్యలు
- మోసగాళ్లు ఏ విధంగా ఆకర్షిస్తారో తెలుసా?.. వీడియో
- వ్యవసాయ మంత్రిని అడ్డుకుని నిలదీసిన రైతులు
- వ్యవసాయ చట్టాలపై పదో విడత చర్చలు ప్రారంభం
- షూటింగ్ వల్లే ఆలియా భట్ అలసిపోయిందా ?
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..