మందపల్లి అభివృద్ధికి కృషి చేస్తా

- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
- దత్తత గ్రామంలో పర్యటన
- చెక్ డ్యాం నిర్మాణంపై గ్రామస్తులతో సమావేశం
పెంబి : మందపల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చే సేందుకు కృషిచేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. తన దత్తత గ్రామంలో సోమవారం పర్యటించారు. ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప ల్కేరు వాగుపై రూ.3.19 కోట్లతో చెక్‌డ్యాం మంజూరై, రద్దు కావడంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తప్పకుండా చెక్‌డ్యాం నిర్మించి గేట్లు కూడా ఏర్పాటు చేయాలని, దీంతో 2 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు విన్నవించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే.. వెంటనే ఇరిగేషన్ అధికారి శ్రీనివాస్‌తో మాట్లాడారు. చెక్‌డ్యాం నిర్మాణానికి అంచనా విలువ వేయాలని సూచించారు. సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లపై బురద, మురుగు నీరు ఒక్కచోట నిలిచి ఉండడంతో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి, తక్షణమే పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెర్పూరి సుధాకర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పుప్పాల శంకర్, రైతు బంధు సమితి కన్వీనర్ భూక్యా గోవింద్, పీఏసీఎస్ డైరెక్టర్ సూదుల శంకర్, నాయకులు భూమాగౌడ్, ఎస్ఐ సాముల రాజేశ్ పాల్గొన్నారు.
‘హరితహారం’లో..
ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణం విద్యానగర్‌లోని మైనారిటీ గురుకుల పాఠశాల, శ్రీరాంనగర్‌లోని రజక సంఘ భవన ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్‌తో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ ‘హరితహారం’లో భాగంగా మొక్కలు నాటారు. భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఎస్ఐ భవానీసేన్, కౌన్సిలర్లు కావలి సంతోష్, రైతు బంధు సమితి అధ్యక్షుడు కడార్ల గంగనర్సయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పరిమి సురేశ్, జన్నారపు శంకర్, నాయిని సంతోష్, ఎనగందుల నారాయణ, రజక సంఘం నాయకులు సట్ల శంకర్, నర్సయ్య, మైనారిటీ గురుకులంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బియాబాని, షబ్బీర్ పాషా, టీ రాజగంగన్న, గౌలికార్ రాజు, పంబాల భీమేశ్, డబ్బ శ్రీనివాస్, అంజద్‌ఖాన్, సలీంఖాన్, ఇజ్రార్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
- సంప్రదాయ బడ్జెట్ హల్వా వేడుక రేపే
- తాండవ్ మేకర్లకు షాక్
- అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- థాయ్‌లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
- అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- ఎంపీ అర్వింద్..రాజీనామా చేశాకే రైతులతో మాట్లాడు