గురువారం 13 ఆగస్టు 2020
Nirmal - Jul 05, 2020 , 22:57:53

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

నిర్మల్‌ అర్బన్‌ : కరోనా కట్టడికి  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసున్నదని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ వేణుగోపాలాచారి అన్నారు. ఆదివారం నిర్మల్‌లోని స్థానిక విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకులు తెలంగాణ సర్కారును విమర్శించడం పరి పాటిగా మారిందన్నారు. కేంద్రం రాష్ర్టానికి కేవలం 182.12 కోట్ల కొవిడ్‌ నియంత్రణకు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద అన్ని రాష్ర్టాలకు వచ్చిన ఫండే తెలంగాణకు వచ్చిందని, రాష్ర్టానికి ఇవ్వాల్సిన న్యూట్రీషన్‌ ఫండ్‌ రూ. 170కోట్లు, బీఆర్‌జీఎఫ్‌ రూ. 450 కోట్ల,14వ ఆర్థిక సంఘం నిధులు రూ.786కోట్లు, జీఎస్టీ రూ. 1500 కోట్ల నిధులను ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. 


logo