గురువారం 21 జనవరి 2021
Nirmal - Jul 05, 2020 , 00:57:47

మరో ఐదు నెలలు ‘ఉచితం’

మరో ఐదు నెలలు ‘ఉచితం’

  • n లబ్ధిదారులకు నవంబర్‌ దాకా  ఫ్రీగా రేషన్‌ పంపిణీ
  • n ప్రతి యూనిట్‌కు    10 కిలోల చొప్పున..
  • n కరోనా నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : కరోనా నేపథ్యం లో రేషన్‌కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభ వార్త వినిపించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా.. ఇప్పటికే మూడు నెలలుగా ఉచిత రేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఒక్కో లబ్ధిదారుడికి (యూనిట్‌) 12 కిలోల బియ్యం, కిలో కంది పప్పు చొప్పున ప్రతినెలా ఉచితంగా అందించారు. తాజాగా కరోనా వ్యా ప్తి ఉండడంతో జూలై నుంచి నవంబర్‌ దాకా మరో ఐదు నెలల పాటు ఉచిత రేషన్‌తో పాటు కందిపప్పు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌కు 10 కిలోల చొప్పున బియ్యం, కిలో కంది పప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ ప్రక్రియ ప్రారం భిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం లేదా గోధుమలు ఇవ్వాలని.. జూలై నుంచి నవంబర్‌ దాకా పంపిణీ చేయాలని ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి.. మొత్తం పది కిలోలు ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంత్యోదయ కార్డుల వారికి ఒక్కో యూనిట్‌కు 35 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుం డగా.. తర్వాత ఒక్కో యూనిట్‌ పెరిగే కొద్ది పది కిలోల చొప్పున బియ్యం పెంచి ఇవ్వనున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు యూనిట్‌కు గతంలోనే పది కిలోల చొప్పున ఉచితంగా ఇవ్వగా.. ఏప్రిల్‌ నుంచి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ప్రస్తుతం కూడా ఒక యూనిట్‌కు పది కిలోలు.. రెండు యూనిట్లు ఉంటే 20 కిలోల చొప్పున ఇస్తారు. ఏప్రిల్‌లో కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వగా.. కొన్ని జిల్లాల్లో మే, జూన్‌ నెల ల్లో గోదాముల్లో నిల్వ చేసుకోకపోవడంతో ఇవ్వ లేదు. దీంతో తాజాగా మే, జూన్‌ నెలలకు సం బంధించి.. రెండు కిలోల కంది పప్పు ఉచి తంగా అందించనున్నారు. జూలై నెలకు సంబంధిం చిన కిలో కంది పప్పు గోదాములకు రాగానే.. ఇస్తామని సివిల్‌ సప్లయ్‌ అధికారులు పేర్కొంటు న్నారు. రేషన్‌ కార్డుదా రులకు ఉచితంగా పది కిలో ల బియ్యం వచ్చే ఐదు నెల ల పాటు ఇస్తుండడంతో.. కరోనా వేళ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరనున్నది. ఇప్ప టికే మూడు నెలల పాటు ఇవ్వగా.. తాజాగా మరో ఐదు నెలలు ఇవ్వాలని నిర్ణయించడంతో.. రేషన్‌ కార్డుదారులకు ఎనిమిది నెలల పాటు ఉచిత రేషన్‌ అందుతున్నది.


logo