శుక్రవారం 07 ఆగస్టు 2020
Nirmal - Jul 02, 2020 , 03:41:21

చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తాం

చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తాం

  • మున్సిపల్ అధికారులు  n ఖిల్లా గుట్ట సందర్శన  

నిర్మల్ అర్బన్ : చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి చేసి, వాటికి పూర్వవైభవం తీసుకువస్తామని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. బుధవారం సా యంత్రం పట్టణంలోని ఖిల్లా గుట్టలో టెరికోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు 15న కోటలపై జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో స్థలాలను పరిశీలించామన్నారు. గతంలో శ్యాంఘడ్ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించామని, ఈసారి ఖిల్లా గుట్టపై ఎగురవేయ నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డీఈ సంతోష్, వైస్ చైర్మన్ సాజీద్, కౌన్సిలర్లు వేణు, గండ్రత్ రమణ, టీఆర్ నాయకులు ఖలీం, రఫీ తదితరులన్నారు.logo