మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి

- జిల్లా విద్యుత్ అధికారి జయంత్ చౌహాన్
నిర్మల్ టౌన్ : మొక్కల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని జిల్లా విద్యుత్ అధికారి జయంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సబ్ హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. విద్యుత్ ఈఈ మధుసూదన్, డీఈ రాజేశ్వర్ కన్ ఏడీఏ రాజేశ్వర్, అధికారులు ఈశ్వర్, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్ : శాంతినగర్ గురుకుల పాఠశాలలో బుధవారం ప్రిన్సిపాల్ నీరడి గంగాశంకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు వెంకట్, గణేశ్, మహేందర్ ఉన్నారు.
దస్తురాబాద్: మండలంలోని బుట్టాపూర్ పంచాయతీ చెన్నూర్ సబ్ నాయకులు, సి బ్బందితో కలిసి విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ మొక్కలు నాటారు. లైన్ మెన్ సంతోష్, సిబ్బంది ప్రేమ్, కుమార్, రంజిత్, ఉదయ్, మనోహర్, నాయకులు బాదం లక్ష్మీరాజం, తిప్పని రంజిత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
దిలావర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల అధికారులతో కలిసి ప్రిన్సిపాల్ శంకర్ మొక్కలు నాటారు. ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ నవీన్ ఎంపీడీవో మోహన్ ఎంపీవో అజీజ్ ఏపీవో జగన్నాథం, సర్పంచ్ వీరేశ్ అధ్యాపకులు జైపాల్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్: పుట్టిన రోజును పురస్కరించుకుని బేస్తవార్ 25వ వార్డు కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్ బుధవారం మొక్కలు నాటారు. టీఆర్ నాయకులు, కాలనీ వాసులు ఉన్నారు.
లక్ష్మణచాంద: చామన్ ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ రాజేశ్వర్ కలిసి డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ మొక్కలు నాటారు. కార్యక్ర మంలో సర్పంచ్ పడిగెల గంగాధర్, ఎంపీటీసీ అ నిత, తహసీల్దార్ సత్యనారాయణరావు, ఎంపీ డీవో మోహన్, ఏపీవో దివ్య, ఎస్ యూనిస్ అహ్మద్ అలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 23న ఎఫ్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం