‘పొగలు కక్కే’టీ..

- ముందు టీ కొట్టు.. వెనుకాల దమ్ము కొట్టు
- ధూమపానానికి అడ్డాలుగా మారిన వైనం
- స్మోక్ జోన్స్.. మన చాయ్ స్టాళ్లు
- సరదాగా మొదలు పెట్టి బానిసవుతున్న యువత
ఎదులాపురం : ఆదిలాబాద్ పట్టణంలోని అనేక అడ్డాల్లో టీస్టాళ్లు ఉన్నాయి. ఇవి గతంలో అధికారిక స్మోక్ జోన్లుగా పిలువబడేవి. 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు బహిరంగ ధూమపానాన్ని నిషేధించాయి. నో స్మోకింగ్ జోన్లను ఏర్పాటు చేశాయి. ఎవరైనా బహిరంగంగా ధూమపానం చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిగరేట్ తాగేందుకు కుర్రకారు చిన్నచిన్న టీ కొట్టులను ఎంచుకుంటున్నారు. వాటిని అధికార స్మోకింగ్ జోన్లుగా మారుస్తున్నారు. ఓ చేతిలో చాయ్ గ్లాస్.. మరో చేత్తో దర్జాగా సిగరెట్ కాలుస్తున్నారు. సిగరెట్ పొగను సుడులుసుడులుగా వదులుతూ.. కప్పులో చాయ్ సిప్ చేస్తూ.. ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. ‘దమ్ మారో దమ్’ అన్నట్లు టీ కొట్లను అడ్డాలుగా చేసుకొని.. విద్యార్థులు, అమాయక యువకుల బతుకులు సైతం పొగ చూరేలా చేస్తున్నారు.
ముందు టీకొట్టు.. వెనుక దమ్ముకొట్టు..
చూడడానికి అది ఓ చిన్న కొట్టు.. ముందు టీ తయారు చేస్తున్న వ్యక్తి.. అక్కడ టీ తాగుతున్న నలుగురైదుగురు వ్యక్తులు.. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే.. అసలు జరుగుతున్నది వేరు.. ముందు టీ కొట్టు ఉన్నా.. దాని వెనుకకు వెళితే.. దూపమేసినట్లుగా ఆ ప్రదేశమంతా నిండిపోతున్నది. గప్పుగప్పున సిగరెట్ పొగలు కక్కుతూ ఆ పొగల్లో యువత కనిపిస్తుంటారు. కొందరు ఫ్యాషన్ కోసం కాలుస్తుంటే.. మరి కొందరు అప్పటికే అలవాటుపడి దమ్ముమీద దమ్ము కొడుతున్నారు. ఇందులో విద్యార్థులూ ఉంటున్నారు.
ఎన్నెన్నో అడ్డాలు..
ఆదిలాబాద్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో టీకొట్టులు అనేకంగా వెలిశాయి. బస్టాండ్, కలెక్టర్ పెట్రోల్ పంజాబ్ ఠాకూర్ శివాజీ చౌక్, దస్నాపూర్ తదితర అడ్డాలతో పాటు అక్కడక్కడ చిన్న చిన్న హోటళ్లు చాలానే ఉన్నాయి. టీ స్టాళ్లలో వెనుక వైవునకు వెళ్లి చూస్తే టీ తాగేవారికంటే సిగరెట్లు తాగుతున్నవారే అధికంగా కనిపిస్తారు. చాలా మంది యువకులు తల్లిదండ్రులకు తెలియకుండానే పొగతాగుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. 2008 అక్టోబర్ 2న వచ్చిన బహిరంగ ధూమపాన
నిషేధ చట్టం ప్రకారం.. జనం తిరిగే ప్రదేశాల్లో పొగతాగితే రూ.200 జరిమానా విధిస్తారు. ఒకటి, రెండు రోజులపాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టం 23 మే 2017లో సవరించబడింది. సీవోటీపీఏ (రాజీకి వీలైన, జామీను యోగ్యమైన నేరం) అయినా.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల టీస్టాల్స్ నిర్వాహకులకు సిగరెట్ల పుణ్యమాని చాయ్ గిరాకీ బాగా పెరిగిపోయి వ్యాపారం జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 200 మందికి గాను రూ.13 వేలు వరకు జరిమానా విధించారు.
పక్క గల్లీలకు మకాం మారుస్తూ..
సిగరెట్లకు అలవాటుపడిన యువకులు తమ నివాస ప్రాంతాల్లో కాకుండా పక్క గల్లీల్లోని అడ్డాలకు మకాం మారుస్తూ దమ్ము కొడుతున్నారు. కొందరు మైనార్టీ తీరని వారు సరదా కోసం కాలుస్తుంటే.. మరికొందరు కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చూస్తే ఇబ్బందులు పడతామని దూర ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. పోలీసులు ఇలాంటి వాటిపై నిఘా ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తుమవుతున్నాయి. మైనార్టీ తీరని వారు సైతం సిగరెట్ అలవాటు పడుతుండడంతో అలాంటి వారు పట్టుబడితే కౌన్సెలింగ్ ఇస్తే కొంతైనా మార్పు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రచారం చేస్తేనే.. బహిరంగ ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేయాలి.
బహిరంగ ప్రదేశంలో ఏ వ్యక్తి ధూమపానం చేయకూడదు.
ధూమపానం చేయకూడని ప్రదేశం, ఇక్కడ ధూమపానం చేయడం నేరం అని సూచించే 60X30 సెంటీమీటర్ల సైజులో బోర్డు ఏర్పాటు చేయబడి ఉండాలి.
ఎవరికి ఫిర్యాదు చేయాలో ఆ వ్యక్తి వివరాలు ప్రముఖంగా ప్రదర్శించాలి.
యాష్, ట్రే, లైటర్, అగ్గిపుల్లలు మొదలైన ధూమపానం చేయడానికి దోహదపడే సామగ్రి అందుబాటులో ఉండకూడదు.
ఉల్లంఘిస్తే..
నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.200 (సెక్షన్ 21) జరిమానా వేయబడతుంది.
యజమాని, హక్కుదారుడు, మేనేజర్, సూపర్ బహిరంగస్థలం అధీకృత అధికారి పొగ తాగడంపై విధించబడిన నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్య తీసుకొనని లేదా నివేదించడంలో విఫలమైతే శిక్షలు ఉంటాయి.
యజమాని హక్కుదారుడు, మేనేజర్ అక్కడ ఉన్న వారికి (సీవోటీపీఏ) సెక్షన్ 21 కింద ఆపరాధ రుసుముతో పాటు పబ్లిక్ న్యూసెన్స్, ఆరోగ్యానికి హాని కలించేలా గాలిని కలుషితం చేయడం లాంటివి ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 268, 278 ప్రకారం శిక్షలను నియమిత అధికారి విధించవచ్చు.
తాజావార్తలు
- బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
- డార్క్ వెబ్‌లో కీలక డేటా