బుధవారం 20 జనవరి 2021
Nirmal - Jul 01, 2020 , 03:27:50

హరితకాలనీ దిశగా తాటిగూడ..

హరితకాలనీ దిశగా తాటిగూడ..

  • n  మాజీ మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు,  ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్‌   హైమద్‌ ప్రత్యేక చొరవ 
  • n  సొంత ఖర్చులతో మొక్కలు నాటి   ట్రీ గార్డుల ఏర్పాటు 
  • n  కలెక్టర్‌ సూచనతో  శ్రీకారం

ఎదులాపురం :  జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్‌ 22 తాటిగూడ హరితకాలనీ దిశగా పయనిస్తున్నది. మాజీ మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు, ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫారుఖ్‌ హైమద్‌ సొంత ఖర్చులతో ప్రతి ఇంటి ఎదుట  రెండు మొక్కలు నాటించారు. అంతేగాకుండా వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయించి సంరక్షణ బాధ్యత ఇంటి యజమానులకు అప్పగించారు. గతంలో కలెక్టర్‌ శ్రీదేవసేన మొదటి సారిగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి వచ్చారు. విశాలమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు చూసి కాలనీలో రోడ్డుకిరువైపులా మొక్కలు నాటితే బాగుంటుదని సూచించారు. దీంతో ఆయన వెంటనే మున్సిపల్‌ ద్వారా జిల్లా అటవీ శాఖ అధికారికి లేఖ రాయిం చి  మావల నర్సరీలోని 390 మొక్కలు ఇవ్వగా,  సొంత వాహనంలో తీసుకువచ్చి నాటించారు. ఉదయం, సాయంత్రం ఇంటి యజమానులు నీరు పోస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే ఈ కార్యక్రమం ప్రారంభించారు. 390 ట్రీగార్డులు, గ్రీన్‌ మ్యాట్‌లు, మేస్త్రీ  ఖర్చు మొత్తం రూ.2, 44.000 వేలు అయ్యాయని ఆయన పేర్కొ న్నారు.  అంతేగాకుండా గత నెల 25న హరితహారంలో భాగంగా  40 మొక్కలు నాటారు.  ఇక్కడ నాటిన మొక్కలను మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌లో వాటప్స్‌ ద్వారా పంపించారు. ఆయన సైతం అభినందించారు.

వచ్చే నెలలో  మొక్కలకు పేర్లు..

కలెక్టర్‌ శ్రీదేవసేన సూచనతో తాటిగూడలో ప్రతి ఇంటి ఎదుట రెండు మొక్కలు నాటినం. అంతేగాకుండా రక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేసిన.  పట్టణంలోని 49 వార్డుల్లో కాలనీని ఆ దర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. త్వరలోనే ప్రతి మొక్కకూ నామకరణం చేస్తాం. ఇం ట్లో పెద్దవారు ఎవరైనా మృతి చెందిన వారు ఉంటే కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు వారి స్మారకార్థం మొక్కకు నేమ్‌ ప్లేట్లు పెడు తాం. ఇప్పటికే 400 నేమ్‌ ప్లేట్లను ఆర్డర్‌ చేశా. ఈ నెలలో అమర్చుతాం. 

-పారుఖ్‌ హైమద్‌, మాజీ మున్సిపల్‌ ఉపాధ్యక్షుడు , ఎంఐఎం పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి 


logo