శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Jul 01, 2020 , 03:27:50

ఆడబిడ్డలకు కానుక ‘కల్యాణలక్ష్మి’

ఆడబిడ్డలకు కానుక ‘కల్యాణలక్ష్మి’

  •  ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌  n  చెక్కుల అందజేత

దస్తురాబాద్‌ : ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మిని కానుకగా ఇస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. మంగళవారం ఖానాపూర్‌ క్యాంపు కార్యాలయంలో  అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మున్యాల, మున్యాల తండా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి సారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రవేశ పెట్టి  పేదలకు అండగా నిలిచారన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ సింగరి కిషన్‌, తహసీల్దార్‌ బత్తుల విశ్వంబర్‌, ఆర్‌ఐ కవిత, సర్పంచ్‌లు దుర్గం శంకర్‌, సరేశ్‌ నాయక్‌, నాయకులు సంతపూరి శ్రీనివాస్‌, దుర్గం రాజలింగు, ఉల్వకాని విలాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.logo