సోమవారం 06 జూలై 2020
Nirmal - Jun 30, 2020 , 02:35:59

రక్తహీనత నిర్మూలనకు చర్యలు

రక్తహీనత నిర్మూలనకు చర్యలు

  • n ఆదిలాబాద్ అడిషనల్ డీఎంహెచ్ మనోహర్
  • n గాదిగూడ పీహెచ్ తనిఖీ

నార్నూర్ : గర్భిణుల్లో రక్తహీనత నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ అడిషనల్ డీఎంహెచ్ కుడ్మెత మనోహర్ వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో ఆదేశాలతో సోమవారం గాదిగూడ పీహెచ్ తనిఖీ చేశారు. వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. గర్భిణులకు వైద్యం అందించే తీరును అడిగి తెలుసుకున్నా రు. రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించారు. నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారిలో హిమోగ్లోబిన్ పెరిగేలా మెరుగైన వైద్యం అం దించాలని సూచించారు. ప్రతి గర్భిణికి సంబంధించి రికార్డులు నమోదు చేసుకోవాలని, దవాఖానలోనే ప్రసవం పొం దేలా చూడాలన్నారు. సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. మాతాశిశు మరణాలను ఆరికట్టేందుకు కృషిచేయాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు శారద, నవ్య, పవన్ సిబ్బంది ఉన్నారు.


logo