నాటిన మొక్కలను సంరక్షించాలి

- జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
గుడిహత్నూర్ : నాటిన మొక్కలను సంరక్షించాల్సి న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. శనివారం ఎంపీటీసీ అంకతి సవిత చేను గట్టున హరితహారం కా ర్యక్రమాన్ని జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ, చేను గట్లలో మొక్కలు నాటుకోవడానికి రైతులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ పుండలిక్, సర్పంచ్ జాదవ్ సునీ త, ఎంపీటీసీ అంకతి సవిత, ఎంపీడీవో పుష్పలత, ఈజీఎస్ ఏపీవో సంగీత, టీఆర్ఎస్ మండ ల కన్వీనర్ కరాడ్ బ్రహ్మనంద్, నాయకులు జాద వ్ రమేశ్, లక్ష్మీనారాయణ, వామన్, గుణవంత్‌రావు, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
బోథ్: మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాలలో శనివారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ స్వర్ణలత, స ర్పంచ్ సురేందర్‌యాదవ్ మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మొదటి విడుత హరితహారంలో నాటి మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ హ్లాద భరితంగా కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో శ్రీనివాస్‌రెడ్డి, టీఏ శంకర్, వార్డు సభ్యులు వినయ్ పాల్గొన్నారు.
నేరడిగొండ : ప్రతి గ్రామాన్ని హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఏఎస్ఐ కాత్లె రమేశ్ సూచించారు. శనివారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలో సర్పంచ్ సోలంకి గీతతో కలిసి మొక్కలు నాటారు. ఉప సర్పంచ్ సోలంకి మధన్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, నాయకులు మదన్‌సింగ్, జగన్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్: నర్సరీల్లో ఏర్పాటు చేసిన ప్రతి మొక్కనూ నాటే విధంగా ఏర్పాట్లు చేయా లని డీఎల్పీవో భిక్షపతిగౌడ్ సూచించారు. శనివా రం మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ రాథోడ్ జనార్దన్‌తో కలిసి ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఆయన వెంట కారోబార్ రవీందర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
- 'రాహుల్‌గాంధీ మీకు అబద్దాలు చెప్పడానికి సిగ్గనిపించదా..?'
- సీబీఐకి ఊమెన్ చాందీపై లైంగిక దాడి కేసు
- డీఆర్డీవోలో అప్రెంటిస్‌లు
- రెండేళ్ల కూతురికి జడ చిక్కులు తీసిన హీరో
- హ్యాపీ బర్త్ డే పుజారా..
- దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..
- హైదరాబాద్ నవాబు వారసత్వం కేసును తేల్చండి : సుప్రీం
- ఇదోరకం కల్లు..!
- వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
- వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్