ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Jun 28, 2020 , 02:02:27

సర్వరోగ నివారణకు సంజీవని

సర్వరోగ నివారణకు సంజీవని

  • n కనుమరుగవుతున్న మొక్కలు  n రాష్ట్ర సర్కారు దృష్టి
  • n ఆరో విడుతలో ఇంటింటికీ పది మొక్కల చొప్పున పంపిణీ 

శాయంపేట:ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కింద వన వృద్ధి చేస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రజారోగ్య రక్షణపైనా దృష్టి పెట్టింది. ఓ వైపు పండ్లు, పూలు, నీడ నిచ్చే వృక్షజాతులేకాదు.. ఆరోగ్యాన్ని, ఆయుష్షునిచ్చే ఔషధ గుణాలున్న మొక్కలను అందిస్తున్నది. అందులో భాగంగా హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉండి, సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధిగాంచిన కృష్ణతులసి మొక్కలను ఆరో విడుతలో ఇంటింటికీ పది చొప్పున ఇస్తున్నది. 

ఔషధగుణాలెన్నో.. 

తులసి ఆకుల్లో బోలెడు ఔషధ గుణాలున్నాయి. ఆకుల రసం జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యా ధులు, గుండెజబ్బులు, వాపులు, మలేరియా, వంటి రుగ్మతలను నయం చేస్తుంది. తులసి ఆకులు నాడులకు టానిక్‌లాగా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచేందుకు తో డ్పడతాయి. వర్షాకాలంలో మలేరియా, డెంగీ ఉన్నప్పు డు లేత తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. జ్వరం తీవ్రంగా ఉంటే తులసి ఆకులు, యాలకుల పొడిని కలిపి నీటిలో మరిగించి కషాయం తయారు చేసి అందులో చక్కెర, పాలు కలిపి తీసుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమాల్లో కఫాన్ని తొలగించడానికి తోడ్పడుతుంది. తులసి ఆకులను నోట్లో పెట్టుకుని నమిలితే జలుబు, ఫ్లూ రాకుండా కాపాడుకోవచ్చు. ఎండిన తులసి ఆకులు ధా న్యం నిల్వ చేసిన చోట ఉంచితే కీటకాలు రావు. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, యాంటి యాక్సిడెంట్ గుణా లతో బ్లడ్ షుగర్ తగ్గించేందుకు పనికొచ్చే పదార్థాలు తులసిలో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోతాయి. ప్రతి రోజూ రెండుసార్లు 12 తులసి ఆకులు తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. తులసి ఆకులను మజ్జిగతో తింటే బరువు తగ్గుతారు. తేనెతో కలిపి పరిగడుపున తీసుకోవడం వల్ల అనేక పోషకాలు, విటమిన్లు అందుతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తులసిలో యాంటిసెప్టిక్ గుణాల వల్ల చర్మ సంబంధిత అలర్జీలు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో ఔషధ లక్షణాలున్న తులసి ఇప్పుడు పట్టణీకరణ నేపథ్యంలో కనుమరుగవుతున్నది. ఏదో కొద్ది మంది ఇండ్లలో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు ఇంటింటికీ అందించాలని నిర్ణయించింది. 

ఇంటికి పది మొక్కలు.. 

ప్రభుత్వ ఆదేశాలతో వరంగల్ రూరల్ జిల్లాలోని పలు నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచారు. ఈ మేరకు శాయంపేట మండలంలో మొక్కలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి రంజిత్‌కుమార్ తెలిపారు. రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని, అయితే ఇంటికి పది మొక్కల చొప్పున ప్రస్తుతం 32,409 సిద్ధంగా ఉన్నాయని, ఇంకా కొన్ని సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.

ఇంటిదైవంగా..

తులసిలో రెండు జాతులు ఉన్నాయి. 

ముదురు రంగులో ఉంటే కృష్ణతులసి 

అని, కొంచెం లేత రంగులో ఉంటే 

రామతులసి అంటారు. కృష్ణతులసిని

పూజకు, ఆయుర్వేద ఔషధాల్లో అధికంగా వాడుతారు. తులసిని హిందువులు పరమపవిత్రమైనదిగా భావిస్తారు. తులసిని సర్వరోగ నివారిణి. తులసి మొక్క రోజంతా ప్రాణవాయువును వదులుతుంది. అందువల్ల ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలైనా పెంచితే వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


logo