బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jun 27, 2020 , 02:24:34

నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

  • ఎమ్మెల్యే జోగురామన్న

బేల: గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్ర భుత్వం డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న ట్లు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న అన్నా రు.  మండలంలోని మాంగ్రూడ్‌ గ్రామంలో రూ.5.4 కోట్లతో వంద డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మండల నాయకులతో కలిసి శుక్రవా రం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అందిస్తోందని తెలిపారు. గ్రామాల్లో ఇండ్లు లేని వారితో దరఖాస్తు చేయిం చాలని , కాంట్రాక్టర్లు కూడా ముందుకు వస్తే త్వరలోనే పనులు ప్రారంభించవచ్చునని తెలిపారు. ఆ దిలాబాద్‌ నియోజకవర్గంలో దాదాపు వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వ రలోనే సంబంధిత లబ్ధిదారులకు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే పంట పెట్టుబడి సాయాన్ని 99శాతం  మంది రైతులకు అందించినట్లు తెలిపా రు. మిగతా వారికి జూలై 18 లోగా వారి ఖాతా ల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు, దేశ రక్షణలో ఉన్న జవాన్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇంత చేస్తున్నా ప్రతిపక్ష పార్టీల నాయకులు అర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. కొబ్బాయి గ్రామంలో  పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్‌ ఠాక్రే, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు ప్రమోద్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ సాంబయ్య, డీఈ రఫత్‌ఖాన్‌, అడనేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సతీశ్‌పవార్‌, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు వట్టిపెల్లి ఇంద్రశేఖర్‌, నాయకులు దేవన్న,  తన్వీర్‌ఖాన్‌, సంతోష్‌ బెదుల్కర్‌, బండి సుదర్శన్‌, సు ధాంరెడ్డి, వాడ్కర్‌ తేజ్‌రావు, కోడె బిపిన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo