శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Jun 26, 2020 , 00:11:42

మంత్రి అల్లోలతోనే అభివృద్ధి

మంత్రి అల్లోలతోనే అభివృద్ధి

నిర్మల్‌ అర్బన్‌: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ అన్నారు. పట్టణంలో ని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి బంగల్‌పేట్‌ వరకు రోడ్డు వెడల్పు పనులను గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మ ల్‌ పట్టణం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సా ధించిందన్నారు. ఇందుకు మంత్రి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. మహానగరాలకు దీటుగా జిల్లా ముఖ ద్వారాలకు ఆర్చిల నిర్మాణం, పౌం టేన్లు, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు ఏర్పాటు చేయడంతో పట్టణానికి కొత్త శోభ సంతరించుకుందన్నారు. పట్టణంలో అంతర్గత రోడ్ల విస్తర ణ పనులు పూర్తయితే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉం డవన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌ లక్కడి జగన్మోహన్‌ రెడ్డి, కౌన్సిలర్లు మేడా రం ప్రదీప్‌, ఎడిపెల్లి నరేందర్‌, ఆకుల రామకృష్ణ, అడ్ప పోశెట్టి, పూదరి రాజేశ్వర్‌, గండ్రంత్‌ రమణ, తదితరులున్నారు.