సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jun 21, 2020 , 00:00:15

ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోండి

ఎల్‌ఆర్‌ఎస్‌ను వినియోగించుకోండి

 మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌

ఆదిలాబాద్‌ రూరల్‌ : ల్యాండ్‌ రెగ్యూల రైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌)ను అందరూ వినియోగించు కోవాలని  మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ము న్సిపల్‌ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం చుట్టూ ఉన్న పాత జీపీల కింద అనేక అక్రమ లేవుట్లు ఉన్నాయని వాటిలో ప్రజలు ప్లాట్లను కొనుగోలు చేశారని అలాంటి వారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకోవాలంటే ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పని సరన్నారు. 2018 మార్చి30 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్లాట్లను ఎల్‌ఆ ర్‌ఎస్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఫీజును చెల్లిస్తే అలాంటి ప్లాట్లకు గుర్తింపు  ఉం టుందన్నారు. ప్రతి శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్‌లోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చే ప్రజలకు సూచనలు, సలహాలతో పాటు ఆన్‌లైన్‌ చేసి ఇ స్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రం జానీ, ఫ్లోర్‌ లీడర్‌ బండారి సతీశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo