కరోనాకు రక్షణ కవచం.. యోగాసనం

- ఆసనాలు, ప్రాణాయామంతో సంపూర్ణ ఆరోగ్యం
- ప్రయోజనాలు అనేకం
జూన్ 21, 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం అమలులోకి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 11, 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. మన దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహ్తిన్నాం. కేంద్రం ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఆయూష్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి జయించాలంటే యోగా కూడా ఒక మార్గమని ఆయుష్ నిపుణులు పేర్కొం టున్నారు. వైద్యులు సూచించినట్టుగా భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, చేతులకు గ్లౌస్లు తొడుక్కోవడం, మంచి పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు యోగా కూడా సాధన చేస్తే రక్షణ పొందవచ్చు. ప్రధానంగా కరోనా ఉపిరి తిత్తుల సామర్థ్యం దెబ్బతీయడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకడం జరుగుతుంది. దీని నుంచి రక్షణ పొందాలంటే వైద్యుల సూచనలోపాటు యోగా కూడా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. నేడు ప్రపంచ యోగా డే సందర్భంగా కరోనాపై ప్రత్యేక కథనం.. - మందమర్రి రూరల్
పాటించాల్సిన నియమాలు..
u ఉదయాన్నే లేచి మల విసర్జన చేసి కడుపు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.
u యోగాసనాలు వేసేటపుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. సాగే గుణం గల టీషర్ట్, షార్ట్ వేసుకోవాలి.
u అనారోగ్యంతో ఉన్న వారు చేయకూడదు.
u మెత్తని కార్పెట్ పరుచుకొని ప్రశాంత వాతావరణంలో చేయాలి.
u యోగా సాధన చేసే పురుషులు సపోర్టర్ ధరించాలి.
u యోగా సాధన చేసేవారు పొగతాగవద్దు
స్త్రీలు పాటించాల్సినవి :
u స్త్రీలు బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు
u గర్భిణులు ఆరు నెలల వరకు గురువు సమక్షంలోనే ఆసనాలు వేయాలి.
u ప్రసవం తర్వాత నాలుగు నెలల వరకు ఆసనాలు వేయవద్దు
u యోగా సాధన సమయంలో ఎలాంటి ఆభరణాలు ధరించకూడదు.
కరోనా నుంచి రక్షణకు ఆసనాలు..
కరోనా నుంచి రక్షణకు కొన్ని ముఖ్యమైన ఆసనాలు, ప్రాణాయామాలున్నాయి. ఇందులో ఆసనాలు.. త్రికోణాసనం, వక్రాసనం, సేతు బంధాసనం, ఉష్ణ్రాసనం, భుజంగాసనం, మత్స్యాసనం, అర్ధకటి చక్రాసనం, అర్ధ చక్రాసనం, ధనురాసనం, వీర భద్రాసనం. సూర్య నమస్కారాలు, ప్రాణయా మాలు.. బ్రస్థిక, కపాలభాతి, అనులోమ విలోమ, సూర్యభేది, ఉజ్జయిని, శీతలీ ప్రాణాయామాలు రోజు సాధన చేస్తే దీర్ఘకాలిక రోగాలు, కరోనా వంటి మొండి వైరస్ల నుంచి కాపాడుకోవచ్చు. ఒక్కో ఆసనంతో ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది.
మత్స్యాసనం..
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు మత్య్సాసనం ఉపయోగపడుతుంది. ఛాతి భాగం విశాలం కావడంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కరోనా ముఖ్యంగా ఊపిరి తీత్తులను బలహీన పరుస్తుంది కాబట్టి రోజు మత్స్యాసనం వేయడం మంచిది. ఊపిరితిత్తుల్లోని వ్యర్థాలను తొలగించి శుభ్ర పరుస్తుంది. మనపై కరోనా వంటి మొండివ్యాధుల ప్రభావం పడకుండా జాగ్రత్త పడవచ్చు. థైరాయిడ్, ప్యారా థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులు కూడా ప్రభావితం అవుతాయి. కరోనా వస్తుందనే భయందోళనలు మన దరికి చేరవు.
వక్రాసనం..
నరాల వ్యవస్థను, వెన్నుపూసలోని కండరాలను, నరాలను మృదువుగా మార్చుతుంది. కిడ్నీ పనితీరును మెరుగు పరుస్తుంది. పొట్టభాగంలో ఉన్న అన్ని కండరాలకు మర్ధన జరిగి పొట్ట చుట్టూ ఉన్న అనవసర కొవ్వు తొలిగిపోతుంది. క్లోమ గ్రంథి(ప్రాంక్రియస్ ) ప్రభావితం కావడంతో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. మధుమేహం, అజీర్తి ఉన్న వారు చేస్తే మేలు.
త్రికోణాసనం..
కరోనాను ఎదుర్కొవాలంటే శరీరంలో శక్తి ఉండాలి. ఇందుకు ఆహారంతోపాటు అసనాలు కూడా అవసరం. అసనాల్లో సోమరితాన్ని పోగొట్టి శరీరంలో చురుకు తనాన్ని పెంచేందుకు త్రికోణా సనం పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి మొండి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
సేతు బంధాసనం..
కరోనా వ్యాధి కట్టడికి సేతు బంధాసనం మేలు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి విముక్తి కలిగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పొట్ట సంబంధిత భాగాలు, ఊపిరితిత్తులు, థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజ పరుస్తుంది.
అర్ధకటి చక్రాసనం..
ఊపిరితిత్తుల్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా తొలగించి శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా మార్చుతుంది. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. పక్కటెముకలు, పొట్ట సైడ్‌కు
ఉన్న కొవ్వును తొలగిస్తుంది. వెన్నుముక మృదువుగా మారుతుంది. అనవసర ఆలోచనలు తొలగించి ఏకాగ్రతను పెంచుతుంది.
భుజంగాసనం..
కరోనాకు భుజంగా సనం ఎంతో ఉపయోగా పడుతుంది. భుజగా అంటే సర్పం ఈ ఆసనం సర్పాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి శక్తి ఎక్కువ అందుకే భుజగాసనం ఎన్నో వ్యాధులను ఎదుర్కొంటుంది. ఈ అసనంలో మణిపుర, స్వాద్విష్టానా, మూల ధార చక్రాలు ప్రభావితం అవుతాయి కాబట్టి రోగ నిరోధక శక్తి అధికమవుతుంది. దీనితో కరోనా లాంటి వ్యాధులకు ఇది చక్కటి సమదానం. ప్రతి రోజూ భుజంగా సనం సాధన చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే మహిళలకు ఈజీ ప్రసవానికి ఉపయోగకారిగా పని చేస్తుంది.
వీర భద్రాసనం..
వీర భద్రాసనంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా శరీరంపై దాడి చేయకుండా ఈ ఆసనం ఉపయోగ పడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాకుండా నరాల వ్యవస్థ, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రోజుకు రెండు సార్లు రెండు నిమిషాలు ఉండగలిగితే సరిపోతుంది.
తాజావార్తలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం!
- దేశంలో కొత్తగా 9,102 కరోనా కేసులు
- నా సోదరుడికి పద్మవిభూషణ్ ప్రకటించినందుకు సంతోషంగా ఉంది: చిరు
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
- పుజారా అలా చేస్తే.. నా సగం మీసం తీసేస్తా!
- 223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత