శభాష్ ముషారఫ్

n నిర్మల్ కలెక్టర్‌ను అభినందించిన సీఎం కేసీఆర్
n మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు..
నిర్మల్/ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని అభినందించారు. హరితహారంలో నాటిన 90 శాతానికిపైగా మొక్కలను సంరక్షించినందుకు కితాబు ఇచ్చారు. మంగళవారం సీఎం కేసీఆర్‌తో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలో అడవుల నరికివేత దారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ నెట్వర్క్ మ్యాపింగ్‌ను తయారు చేయాలని సూచించారు. మిడతలు ఈనెల చివరి వారం నుంచి జూలై నెల చివరి వరకు వచ్చే అవకాశం ఉండడంతో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలు బాగు పడి తీరాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కల్లాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
- క్షీరగిరి క్షేత్రంలో భక్తుల పూజలు
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం
- రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించిన ముత్తిరెడ్డి
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : కలెక్టర్
- ఏడాదిలో రూ.40.63 కోట్లతో అభివృద్ధి పనులు
- సమాజ సేవలో లయన్స్ క్లబ్‌లు..
- ఘనంగా ఓటరు దినోత్సవం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- రైతన్నల ఆప్తుడు సీఎం కేసీఆర్
- రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలి