శనివారం 16 జనవరి 2021
Nirmal - Jun 17, 2020 , 03:03:50

అన్నదాతల ఆపద్బాంధవుడు కేసీఆర్‌

అన్నదాతల ఆపద్బాంధవుడు కేసీఆర్‌

n రైతుబంధు నిధుల విడుదలపై సర్వత్రా హర్షం

n పలు మండలాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు

ఆదిలాబాద్‌ రూరల్‌ : రెక్కాడితేగాని డొక్కాడని రైతన్నల పాలిట సీఎం కేసీఆర్‌ ఆపద్బాంధవుడని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. రైతుబంధు డబ్బులు రెండు వారాల్లో వేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంపై మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోజుల తరబడి తిరిగేవారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువులు, విత్తనాలకు కొదవ లేకుండా చేశారన్నారు. ఎకరానికి రూ.10వేల రైతుబంధు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌ బండారి సతీశ్‌, కౌన్సిలర్‌ భరత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లా రాజేశ్వర్‌, తిరుపతి రెడ్డి, ఖయ్యూం పాల్గొన్నారు.

బోథ్‌: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మండల రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు రుక్మణ్‌సింగ్‌ మంగళవారం సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బోథ్‌ సర్పంచ్‌ సురేందర్‌ యాదవ్‌, సొసైటీ డైరెక్టర్‌ చట్ల ఉమేష్‌, కే వెంకటరమణాగౌడ్‌, మల్లెపూల సుభాష్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇచ్చోడ : మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పాట్కూరి శ్రీనివాస్‌ రెడ్డి, ఏనుగు కృష్ణారెడ్డి, నార్వడే రమేశ్‌, సుద్ధావార్‌ వెంకటేశ్‌, సాబీర్‌, అబ్దుల్‌ రషీద్‌, ముస్తఫా, గ్యాతం గంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాంసి: తాంసిలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ కంది గోవర్ధన్‌రెడ్డి నాయకులతో కలిసి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ ఎంపీపీ మంజుల, సర్పంచ్‌ స్వప్న, కేమ సదానందం, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పులి నారాయణ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ధనుంజయ్‌, నాయకులు అరుణ్‌, జింకా మహేందర్‌, బొంత కాంతారెడ్డి  ఉన్నారు.

తలమడుగు : మండలంలోని సుంకిడి గ్రామంలో టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మహేందర్‌ యాదవ్‌  పార్టీ నాయకులు ఆశన్న యాదవ్‌, తోట వేంకటేశ్‌, అబ్దుల్లా, మోట్టె కిరణ్‌కుమార్‌, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. 

బజార్‌హత్నూర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన రైతుబంధు  పథకంతో రాష్ట్రంలోని రైతులు  సంతోషంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌  శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ మడిగె రమణ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కేశవ్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, నాయకులు నరేశ్‌, భోజన్న, నానం రమణ, నారాయణ, సకేష్‌, అంకుష్‌, ఊశన్న పాల్గొన్నారు.

భీంపూర్‌: సగటు రైతుకు కావాల్సిన పథకాలన్నీ సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రపంచ వ్యవసాయ చరిత్రలోనే రాష్ర్టాన్ని మేటిగా నిలిపిన మహా అన్నదాత సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మేకల నాగయ్య కొనియాడారు. భీర్‌పూర్‌లో మంగళవారం రైతులు, నాయకులతో కలిసి ఆయన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు లింబాజీ, బక్కి అజయ్‌, హనుమద్దాసు, కరీం, చిన్ను గోవింద్‌రావు, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, రైతు సమితి అధ్యక్షులు బక్కి కపిల్‌, ఉత్తం రాథోడ్‌, జహూర్‌ అహ్మద్‌, కుడిమెత సంతోష్‌, అమృత్‌, గుర్ల నరేందర్‌ యాదవ్‌, మర్ల కల్చాప్‌ యాదవ్‌, సవాయి స్వామి పాల్గొన్నారు.