పరిశీలన ప్రారంభమైంది..

n గ్రామ పంచాయతీల ట్రాక్టర్ ట్రాలీలు, ట్యాంకర్ల తనిఖీలు
నిర్మల్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆయా గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన ట్రాక్టర్ల ట్రాలీలు, ట్యాంకర్ల పరిశీలన ప్రారంభమైంది. క్వాలిటీ కంట్రోల్ విభాగం సభ్యులు మండలాల వారీగా పరిశీలించనున్నారు. సోమవారం నిర్మల్, దస్తురాబాద్ మండలాలకు చెందిన ఆయా గ్రామ పంచాయతీల ట్రాక్టర్ ట్రాలీలు, ట్యాంకర్లను ఎన్టీఆర్ స్టేడియానికి తెప్పించి పర్యవేక్షించారు. ఇటీవల జిల్లాలో గ్రామపంచాయతీలకు ట్రాలీలు, ట్యాంకర్లు సరఫరా చేయగా.. కొన్నిచోట్ల మరమ్మతులు చేసి రంగులు వేశారు. టైర్లకు గ్రూపింగ్ చేశారు. నాసిరకం ట్యాంకర్లు సరఫరా చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 10న ‘పాత ట్యాంకర్లలో అవినీతి ధార’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ స్పందించారు. దీం తో పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ విభాగానికి రాశారు. వాస్తవానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉం టుంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ట్రాలీలు, ట్యాంకర్లకు రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ట్యాంకర్లు సప్లయ్ చేసిన కంపెనీలో కొందరు పాత ట్యాంకర్లకు రంగులు వేసి మరమ్మతులు చేసి సరఫరా చేశారు. మరికొన్ని చోట్ల నాసిరకం, తక్కువ గేజ్ ఉన్న వాటిని సరఫరా చేశారు. దీంతో స్థానిక సర్పంచ్‌లు ఫిర్యాదులు చేయడం, ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో కలెక్టర్ ఆదేశాల మేర కు క్వాలిటీ కంట్రోల్ కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి (పరిశ్రమల శాఖ జీఎం) సురేందర్‌రావు (పంచాయతీరాజ్‌శాఖ ఈఈ), రవాణాశాఖ అధికారులు రమేశ్ సోమవారం నిర్మల్ మండల ట్యాంక ర్లు, ట్రాలీలు పరిశీలించారు. ఫిజికల్, డాక్యుమెం ట్ వెరిఫికేషన్ చేపట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం.. ఉన్నాయా లేవా పరిశీలించి కలెక్టర్‌కు నివేదించనున్నారు. ఈ నివేదికలకు, టెండరు నిబంధనలకు ఒకేరకంగా ఉన్నాయా లేవా లేకుం టే వాటిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. మరోవైపు గడువులోగా ట్యాంకర్లు సరఫరా చేయకుంటే టెండర్ రద్దు అవుతుందని భావించిన కొందరు నాసిరకం, పాత ట్యాంకర్లను సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు వస్తే రిజిస్టేషన్ నాటికి వీటిని మార్చి ఇవ్వాలనే ఆలోచనతో పాత వాటిని సరఫరా చేసినట్లు తెలుస్తున్న ది. మరికొన్నిచోట్ల డబ్బులు చేతులు మారాయనే విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల సర్పంచ్ల నుం చి ఒత్తిడి, బిల్లులు తీసుకోవాలనే ఆలోచనతో పా త వాటిని సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల సర్పంచ్ల నుంచి ఒత్తిడి రావడం తో ప్రస్తుతానికి వీటిని వాడుకోవాలని తర్వాత వీటిని మార్చి కొత్తవి ఇస్తామని తెలిసింది. ‘నమస్తే తెలంగాణ’లో ట్యాంకర్ల అక్రమాలపై కథనం రావడం.. కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో చాలా చోట్ల పాతవి, నాసిరకం ట్యాంకర్లను వెనక్కి తీసుకొని కొత్తవాటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మండలాల వారీగా జరుగుతున్న ట్యాంకర్ల పరిశీలనకు పాత ట్యాంకర్లు తేకుండా స్థానిక సర్పంచ్‌లను బతిమిలాడుతున్నట్లు సమాచారం.
బుట్టాపూర్‌లో ట్యాంకర్ మార్చేశారు..
దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ గ్రామపంచాయతీకి ఓ కంపెనీ ట్యాంకర్‌ను సరఫరా చేసిం ది. ఆ ట్యాంకర్ నాసిరకం ఉండడంతో స్థానిక సర్పంచ్ ఫిర్యాదు చేయడం, ‘నమస్తే తెలంగాణ’ లో కథనం రావడంతో మరుసటి రోజు ఆ ట్యాంకర్‌ను మార్చి దాని స్థానంలో కొత్త ట్యాంకర్‌ను ఇచ్చారు. స్థానిక సర్పంచ్ జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. సదరు కంపెనీ నుంచి ట్యాంకర్ మార్చి కొత్తది ఇచ్చినట్లు స్థానిక సర్పంచ్ తెలిపారు.
తాజావార్తలు
- వికారాబాద్‌లో రైలు ఢీకొని వ్యక్తి మృతి
- నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: సమంత
- అలెక్సీ నవాల్నీని అరెస్టు చేసిన రష్యా
- తెలంగాణలో శబరిమల...ఎక్కడో తెలుసా...?
- బేగంపేటలో రోడ్డుప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌జామ్
- సిరాజ్‌కు 5 వికెట్లు.. టీమిండియా టార్గెట్ 328
- మెట్రోరైల్ ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ
- స్మిత్ ముందే రోహిత్ శర్మ కూడా అదే పని చేశాడా.. వీడియో
- దొరస్వామి మృతికి ఎన్టీఆర్ సంతాపం
- తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు