స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ

నిర్మల్ అర్బన్ : తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లో ల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేం ద్రంలోని 32వ వార్డు ఈద్గాం కాలనీలో రూ.15 లక్షల నిధులతో నిర్మించనున్న నల్లపోశమ్మ ఆలయ పున్నర్మాణానికి ఆదివారం భూ మిపూజ చేశారు. అనంతరం పట్టణంలోని కు రన్నపేట్ కాలనీలో భీమన్నదేవుని ఆలయాన్ని మంత్రి ప్రారంభించి విగ్రహ ప్రతిష్ఠాపన కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభం తో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఆలయాలను నిర్మించుకున్నామని గుర్తుచేశారు. నిర్మల్ జిల్లాలో దాదాపు 400 ఆలయాలకు నిధులు మంజూరు చేశామన్నారు. నిరాదరణకు గురైన ఆలయాలకు దూపదీప నైవేద్యం పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మా జీ రాజేందర్, మాజీ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మా రుగొండ రాము, కౌన్సిలర్లు నల్లూరి పోశెట్టి, ఎడిపెల్లి నరేందర్, నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, గజేంధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అభివృ ద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని చైన్గే ట్ నుంచి బంగల్పేట్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆదివారం నగరేశ్వరవాడలో పరిశీలించారు. అక్కడి నుంచి ద్యాగవాడ కాలనీ వరకు కాలినడకన పర్యటించి ప నులను పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లా కేంద్రం కావడంతో వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నదన్నారు. పట్టణంలో అంతర్గతరోడ్లు ఇ రుకుగా ఉండడంతో ప్రస్తుతం రహదారుల వె డల్పుతో ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నా రు. వర్షాకాలానికి ముందే జౌళినాల పూడికతీత చేపట్టి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టామన్నారు. మంత్రి వెంట ము న్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేంధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేంధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాము, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీమిండియాను సర్కస్‌లో జంతువులలాగా చూశారు!
- WEF సదస్సులో 28న ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు