బిజినెస్ సెంటర్‌గా భైంసా

- వీధికో తీరు వ్యాపారం
- ప్రత్యేకత సంతరించుకున్న పలు సెంటర్లు
- కోట్లాది రూపాయల టర్నోవర్
- రిటైల్, హోల్‌సేల్ వర్తకం
భైంసా: పట్టణంలోని కొన్ని ప్రాంతాలు తీరొక్క ప్రత్యేకతను సంతరిం చుకున్నాయి. బిజినెస్ సెంటర్‌గా భైంసాను జిల్లాలో నంబర్ వన్‌గా నిలుపుతున్నాయి. రోజు రోజుకూ ఇక్కడి వ్యాపారం విస్తరిస్తుండగా అన్ని రకాల వస్తువులకు ఇక్కడి దుకాణాలు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. పట్టణంతో అనుబంధాన్ని పెనవేసుకున్న కొన్ని ముఖ్య ప్రాంతాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
సరుకులకు కేరాఫ్ కిరాణా బజార్..
కిరాణ సరుకులకు కేరాఫ్‌గా గాంధీ గంజ్‌లోని కిరాణ బజార్ నిలిచింది. వర్తకులు, గ్రామీణులకు, బతుకు దెరువు నిచ్చే చోటు ఇదే. నియోజకవర్గంతో పాటు మహారాష్ట్రకు కిరాణా సరుకులు, హోల్‌సెల్ రిటైల్‌గా అందించే వ్యాపార కేంద్రంగా ముద్ర వేసుకున్న ప్రాంతం ఇది. ఈ వ్యాపార కేంద్రంపై కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ఉప్పు నుంచి వక్కపొడి వరకు మొత్తం దొరికే చోటు ఇదే.
ఫర్నిచర్ వ్యాపారం..
వినాయక్‌నగర్‌లో ఫర్నిచర్ వ్యాపారం జోరుగా సాగుతుంది. సామిల్స్, కర్రకోత యంత్రా లతో పాటు రెడీమేడ్ ఫర్నిచర్ విక్రయ కేంద్రంగా పేరొం దింది. కర్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందనే భావనతో ఫర్నిఛర్ దుకాణాలు ఆరంభమయ్యాయి. రెడీమేడ్ ఫర్నిచర్‌కు నిలయంగా వినాయక్‌నగర్ రోడ్డు ప్రసిద్ధి గాంచింది.
వస్త్రలోకం... బట్టల బజార్
బట్టల బజార్ ఈ ప్రాంతంలో వస్త్రలోకంగా పేరొందింది. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా బట్టల వ్యాపారాన్ని వర్తకులు ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందుకే ఈ చోటు బట్టల బజార్‌గా పేరొందింది. రిటైల్, హోల్‌సేల్, వ్యాపారానికి నెలవుగా మారింది. నియోజకవర్గం, మహారాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపార రవాణా ఇక్కడి నుంచే సాగుతుంటుంది. మెయిన్ బజార్ వరకు ఎన్నో బట్టల షాపులు ఉన్నా.. నేటికీ బట్టల బజార్ ప్రత్యేకత చెరిగిపోలేదు. పెళ్లిళ్ల సీజన్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఇతర సమయాల్లోనూ నిత్యం సందడిగా ఉంటుంది.
శానిటరీ, మార్బుల్స్‌కు ఫేమస్..
పట్టణంలోని నిజామాబాద్ వెళ్లే మార్గంలోని దుకాణాలు మార్బుల్స్ వ్యాపారానికి నిల యంగా మారాయి. రాజస్థాన్ టైల్స్, మార్కె ట్లోకి కొత్తగా వస్తున్న మార్బుల్స్‌తో వ్యాపా రం సాగుతుంటుంది. ఈ ప్రాంతంలో సు మారు 10 వరకు మార్బుల్స్ విక్రయ కేంద్రా లు వెలువడడంతో ప్రత్యేకత ఏర్పడింది.
మహాలక్ష్మి జ్యువెల్లరీ మార్కెట్.. బంగారం బజార్
భైంసా మున్సిపల్ కార్యాలయ సమీపంలో శ్రీ మహాలక్ష్మి జ్యువెల్లరీ మార్కెట్లో బంగారం దుకా ణాలే అత్యధికంగా దర్శనమిస్తాయి. తరతరాలుగా బంగారం వ్యాపారం ఇక్కడ కొనసాగుతున్నది. సుమారు 150 వరకు బంగారం దుకాణాలతో పాటు 50వరకు తయారీదారుల దుకాణాలు ఉంటాయి. కొందరు ఇక్కడ బంగారం కొనడం శుభసూచికంగా భావిస్తుంటారు.
గాంధీగంజ్.. వ్యవసాయ వ్యాపార ప్రాంతం..
పట్టణంలోని గాంధీ గంజ్‌లో వ్యవసాయ రంగం వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలతో కిటకిటలాడుతుంటోంది. పట్టణంలోని గాంధీగంజ్‌లో వ్యవసాయ మార్కెట్ ఉండడంతో ఇక్కడ ఎరువుల దుకాణాలు వెలిశాయి. బస్టాండ్‌కు దగ్గర ఉండడంతో నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర వాసులు ఇక్కడి నుంచే విత్తనాలు, ఎరువులు తీసుకెళ్తుంటారు. ఫర్టిలైజర్స్ వ్యాపారానికి ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ప్రింటింగ్ ప్రెస్‌ల వీధి..
పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు కార్డ్డు ప్రింటింగ్ అంటే గుర్తుకు వచ్చే ప్రాంతం ఒక్కటే. ఈ ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్‌ల దుకాణాలున్నాయి. పైగా కొన్ని ఏండ్ల నుంచి ఈ దుకాణాలు నడుస్తున్నాయి. వీటిపై చాలా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇది కూడా సంప్రదాయ వ్యాపారంగా మారింది.